Breaking News

యువతిని కత్తితో పొడిచి పొదల్లో పడేసిన యువకుడు.. భద్రాద్రిలో ఉన్మాది ఘాతుకం


విజయవాడలో దివ్య తేజస్విని హత్యోదంతం మరువక ముందే తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. యువతిని కత్తితో పొడిచి పొదల్లో పడేశాడో దుర్మార్గుడు. అక్కడి నుంచి పారిపోతూ చేతులపై రక్తంతో పోలీసులకు దొరికిపోవడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన జిల్లా ఇల్లెందులో జరిగింది. పట్టణంలోని సత్యనారాయణపురం ప్రాంతంలో యువతి(18)పై కత్తితో దాడి ఘటన కలకలం రేపింది. ఉన్మాదిగా మారిన యువకుడు(23) ఆమెపై కత్తితో దాడి చేసి పొదల్లో పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతూ నైట్ పెట్రోలింగ్ పోలీసులకు కనిపించాడు. యువకుడి చేతులపై రక్తం ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణ ఘటన బయటపడింది. Also Read: యువతిపై కత్తితో దాడి చేసినట్లు చెప్పడంతో వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి యువతిని రక్షించారు. ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న యువతిని వెంటనే ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. Read Also:


By October 30, 2020 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-attacks-18-year-old-girl-with-knife-in-bhadradri-kothagudem/articleshow/78945525.cms

No comments