Breaking News

రాజమండ్రిలో రెచ్చిపోయిన బ్లేడ్‌బ్యాచ్.. యువకుడి ముఖంపై గాట్లు


జిల్లా రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్‌ రెచ్చిపోయింది. షోరూం నుంచి ఇంటికెళ్తున్న యువకుడిని అడ్డగించి విచక్షణా రహితంగా దాడి చేసింది. ముఖంపై బ్లేడు, కత్తితో గాట్లు పెట్టి భయాందోళన సృష్టించింది. నగరంలోని జెండా పంజా రోడ్డులోని బిగ్‌సీ షోరూంలో స్థానిక ఆవ రోడ్డుకి చెందిన రాధాక్రిష్ణ పనిచేస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో షోరూం మూసివేసిన అనంతరం ఇంటికెళ్తున్న రాధాక్రిష్ణపై బ్లేడ్ బ్యాచ్ దాడికి దిగింది. స్వామి థియేటర్ వద్ద రాధాక్రిష్ణని అడ్డగించిన బ్లేడ్ బ్యాచ్ సభ్యులు సాయినాథ్, రేవంత్ కుమార్ పదునైన ఆయుధాలతో దాడి చేశారు. యువకుడి ముఖంపై బ్లేడు, కత్తులతో గాట్లు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రగాయాలపాలైన రాధాక్రిష్ణని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బ్లేడ్ బ్యాచ్ అరాచకంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్లేడ్ బ్యాచ్ దాడి వ్యవహారం తెలుసుకున్న ఎంపీ భరత్ ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు. పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. Also Read:


By October 28, 2020 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/blade-batch-attacks-youth-in-rajahmundry/articleshow/78904388.cms

No comments