Breaking News

దుర్గ విగ్రహం నిమజ్జనంలో అపశృతి.. ఐదుగురు మృతి


దసరా ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. దుర్గాదేవి విగ్రహం నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్తున్న రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రెండు పడవల్లో 20 మంది ప్రయాణించినట్లు చెప్పారు. నీటిలో నుంచి ఐదు మృతదేహలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. మృతులను సుఖేందు దే (21), పికోన్ పాల్ (23), అరిందం బెనర్జీ (20), సోమనాథ్ బెనర్జీ (22) లుగా పోలీసులు గుర్తించారు. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన జరిగిందన్నారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా తెలిపారు. మృతులంతా బెల్డంగా ప్రాంతానికి చెందిన వారని అధికారులు తెలిపారు. Read More: ఇంకా ఎవరైనా మునిగి పోయి ఉండవచ్చునన్న అనుమానంతో గజ ఈతగాళ్ల సాయంతో చెరువును గాలిస్తున్నామని చెప్పారు. ప్రమాదం గురించి తెలియగానే విపత్తు నిర్వహణ బృందం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ,మరిన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


By October 27, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-drown-to-death-in-boat-capsized-durga-idol-immersion-in-west-bengal/articleshow/78883736.cms

No comments