Vizag: ఎక్కడికెళ్లినా వీడియోకాల్ చేయమంటున్న భర్త.. భరించలేక భార్య ఆత్మహత్య

అనుమానపు భర్త భరించలేక పెళ్లైన మూణ్నెళ్లకే చేసుకున్న అత్యంత విషాద ఘటన జిల్లాలో జరిగింది. ఎక్కడికెళ్లినా వీడియోకాల్ చేయమంటూ భర్త అనుమాన పడుతుండడం తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. జోడుగుళ్లకి చెందిన కోన మల్లేశ్వరరావు, సత్యవతి దంపతుల రెండో కుమార్తె దేవిని పెందుర్తి మండలం యాతపేటకి చెందిన నడిగొట్టి సురేశ్‌కిచ్చి మూడు నెలల కిందట జూన్ 14న పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ప్రభుత్వ హాస్టల్‌లో వంటమాస్టర్‌గా పనిచేస్తున్న అల్లుడికి వివాహ సమయంలో భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. మూడు లక్షల నగదు, సారె కింద మరో లక్ష, బంగారం కింద రూ.90 వేలు, బైక్ కొనుక్కునేందుకు రూ.50 వేలు కూడా ఇచ్చారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా సురేష్ అనుమాన రోగంతో వేధింపులకు దిగాడు. భార్య ఎక్కడికెళ్లినా అనుమానపడుతూ నిత్యం వేధింపులకు గురిచేశాడు. ఎక్కడ ఉన్నా తనకు వీడియో కాల్ చేసి చూపించమంటూ హింసించడంతో దేవి మానసికంగా కుంగిపోయింది. Also Read: నాలుగు రోజుల కిందట తల్లిదండ్రులతో కలసి మోదకొండమ్మ గుడికి వెళ్లింది. ఆ విషయం చెప్పినా అక్కడి నుంచి వీడియో కాల్ చేయమనడంతో ఆమె భరించలేకపోయింది. అనుమానపు భర్త వేధింపులు తట్టుకోలేక దారుణ నిర్ణయం తీసుకుంది. మనస్థాపంతో పుట్టింట్లోనే ఉండిపోయిన దేవి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై మూడు నెలలు తిరక్కుండానే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also:
By September 13, 2020 at 11:07AM
No comments