Breaking News

Sundeep Kishan: నగ్నంగా సందీప్ కిషన్.. హీరోతో ఫుల్లుగా ఎంజాయ్ చేశానంటూ మ్యాటర్ బయటపెట్టిన హాట్ బ్యూటీ!


యంగ్ హీరో కండలు తిరిగిన శరీరం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ హీరోలంతా సిక్స్ ప్యాక్ లుక్స్ కోసం ట్రై చేస్తున్న నేపథ్యంలో తన లేటెస్ట్ మూవీ ‘’ కోసం ఆశ్చర్యపర్చేలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు సందీప్ కిషన్. సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారి కండలు చూపిస్తూ తన నగ్న శరీరాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ పిక్ నెట్టింట హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ . పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, వెంకటాద్రి టాకీస్‌ పతాకాలపై హాకీ నేపథ్యంలో రూపొందుతున్న ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ మూవీలో సందీప్ కిషన్- లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో ఇద్దరూ కూడా హాకీ ప్లేయర్స్‌గా కనిపించనుండటం విశేషం. అయితే ఇప్పటిదాకా తన సినిమాల్లో సాధారణ శరీరాకృతితో కనిపించిన సందీప్ కిషన్.. ఈ మూవీ కోసం సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారాడు. ఈ క్రమంలో తన లేటెస్ట్ లుక్ పోస్ట్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేశాడు. ఇది చూసి హీరోయిన్ లావణ్య వెంటనే ఓపెన్ అవుతూ తన ఫీలింగ్స్ బయటపెట్టేసింది. Also Read: ''ఎ1 ఎక్స్‌ప్రెస్ మూవీలో సందీప్ కిషన్‌తో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. ఈ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేశా'' అని పేర్కొంది హాట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. దీంతో ఆమె చేసిన ఈ సరదా కామెంట్, సందీప్ న్యూడ్ లుక్ నెట్టింట తెగ హంగామా చేస్తున్నాయి. ఇది చూసి నెటిజన్స్ ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న 'ఎ1 ఎక్స్‌ప్రెస్' చిత్రం లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. అతిత్వరలో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ క్లైమాక్స్ భారీగా చిత్రీకరించనున్నారట. హాకీ మ్యాచ్ మీదే ఈ క్లైమాక్స్ మొత్తం నడవనుందట. ఈ షూట్ కోసం మొహాలీలోని హాకీ స్టేడియం ఎంచుకున్నారట దర్శకనిర్మాతలు.


By September 19, 2020 at 08:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lavanya-tripathi-open-comments-on-sundeep-kishan-six-pack-look/articleshow/78198438.cms

No comments