Breaking News

అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు


సినీ హీరో అల్లు అర్జున్‌‌పై సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఆయన కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సందర్శనను అధికారులు నిలిపివేసినా అల్లు అర్జున్‌ సహా పుష్ప సినిమా నిర్మాణ బృంద సభ్యులు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ జలపాతాన్ని సందర్శించడంతోపాటు, తిప్పేశ్వర్‌లో అనుమతులు లేకుండా చిత్రీకరణ చేశారన్నారు. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్‌రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక విచారణ అనంతరమే దీనిపై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. ఇదే విషయమై ఆదిలాబాద్‌ డీఎఫ్‌ఓ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆ సంఘం ప్రతినిధులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. Read More: స్టైలిష్ స్టార్ ఇటీవల తన కుటుంబసభ్యులతో పాటు స్నేహితులతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కుంటాల జలపాతం వద్ద సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అక్కడ ఆయన అభిమానుల్ని పలకరిస్తూ ఓపెన్ టాప్ జీపులో కూడా ప్రయాణించారు. కుంటాల జలపాతం వద్ద పార్కులో ఆయన మొక్కలు కూడా నాటారు.


By September 17, 2020 at 07:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/police-complaint-on-allu-arjun-for-visit-kuntala-water-falls/articleshow/78158731.cms

No comments