ప్రియుడితో కలిసి భర్త హత్య.. అఫైర్‌కి అడ్డొస్తున్నాడని మహిళ ఘాతుకం

తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన దారుణ ఘటన కృష్ణా జిల్లా కోనాయపాలెంలో చోటుచేసుకుంది. బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన రామారావు(50), చిన్నారి దంపతులు ఆరు నెలలుగా కోనాయపాలెంలోని చేపల చెరువుకు రాత్రివేళ కాపలాగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రహీం అనే వ్యక్తితో చిన్నారికి ఏర్పడింది. Also Read: ఈ విషయం తెలుసుకున్న రామారావు భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. దీంతో తమ సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన చిన్నారి ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి ఆదివారం రాత్రి కర్రలతో కొట్టి చంపేసింది. సోమవారం ఉదయం చెరువు వద్ద మృతదేహం ఉందనే సమాచారంతో డీఎస్పీ రమణమూర్తి, గ్రామీణ సీఐ సతీష్, ఎస్ఐ మణికుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్యగా భావించి విచారణ చేపట్టారు. భార్యను ప్రశ్నించగా ప్రియుడితో కలిసి తానే నేరం చేసినట్లు అంగీకరించింది. Also Read:
By September 01, 2020 at 09:18AM
No comments