Breaking News

వారాల వ్యవధిలో మరోసారి ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా?


కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మరోసారి ఎయిమ్స్‌లో చేరినట్టు సమాచారం. శ్వాస సంబంధ సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి 11 గంటలకు ఆయన ఎయిమ్స్‌లో చేరినట్టు భోగట్టా.. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆగస్టు 2న అమిత్ షా‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా చికిత్స కోసం గురుగావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స అనంతరం కోలుకున్న ఆయనకు ఆగస్టు 14 నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు. మళ్లీ కొద్ది రోజుల్లోనే అనారోగ్యానికి గురికావడంతో తిరిగి ఆగస్టు 18న ఎయిమ్స్‌ పోస్ట్-కోవిడ్ కేర్ సెంటర్‌లో చేరి కోలుకున్నారు. శ్వాసకోస సమస్యకు రెండు వారాలు చికిత్స తీసుకుని ఆగస్టు 31న డిశ్చార్జయ్యారు. అయితే, వారాల వ్యవధిలోనే శ్వాస సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలియడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండటమే ఉత్తమమని భావించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 11.00 గంటల ప్రాంతంలో కార్డియాక్ న్యూరో టవర్‌లో చేరినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్పత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు ధ్రువీకరించలేదు. అయితే, అమిత్ షా శనివారం రాత్రి 11.00 గంటలకు ఆస్పత్రిలో చేరారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అత్యంత ప్రముఖులకు చికిత్స అందజేసే కార్డియాక్ న్యూరో టవర్‌లోనే అమిత్ షా ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని చికిత్స కొనసాగుతోందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అభిజ్ఞాన వర్గాలు తెలిపాయి.


By September 13, 2020 at 07:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/weeks-after-discharge-union-home-minister-amit-shah-re-admitted-to-aiims/articleshow/78084891.cms

No comments