Breaking News

ఆపరేషన్ డాల్ఫిన్ నోస్: కీలక వ్యక్తి అరెస్ట్.. నేవీ కదలికలపై పాక్ ఏజెంట్లు నిఘా


గూఢచర్యం కేసులో సోమవారం ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ () తెలిపింది. గుజరాత్‌లోని గోద్రా జిల్లా పంచ్‌మహల్‌కు చెందిన గితేలి ఇమ్రాన్ (37) అనే వ్యక్తి అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొంది. భారత నౌకదళానికి చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐకు ఇమ్రాన్ చేరవేసినట్టు గుర్తించారు. నౌకలు, జలాంతర్గాములు, ఇతర రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సున్నిత సమాచారంపై నిఘా ఉంచినట్టు ధ్రువీకరించారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ఐఎస్ఐ ఏజెంట్లతో కొందరు నౌకాదళ సిబ్బంది కాంటాక్ట్ అయినట్టు దర్యాప్తులో తేలింది. ఐఎస్ఐకు చెందిన భారతీయ సహచరుల ద్వారా నేవీ ఉద్యోగులకు డబ్బు పంపినట్టు గుర్తించారు. పేరిట నిఘా సంస్థలు విచారణ చేపట్టాయి. భారత నౌకాదళ కదలికలపై నిఘాకు పాకిస్థాన్ ఏజెంట్లను నియమించినట్టు గుర్తించారు. నౌకలు, జలాంతర్గాముల కదలికలపై పాక్ ఆధారిత గూఢచారి ఏజెంట్లు నిఘా పెట్టినట్టు పసిగట్గాయి. ఈ కేసులో మొత్తం 14 మందిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ తాజాగా, గితేలి ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుంది. వస్త్ర వ్యాపారం పేరుతో పాకిస్థాన్ గూఢచారులు, ఏజెంట్లను గితేలీకి సంబంధాలున్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. భద్రతకు సంబంధించిన రహస్యాలను చేరవేసినందుకు ప్రతిఫలంగా పాక్ గూఢచారుల ఆదేశాలతోనే భారత నౌకదళ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో గితేలి నగదు జమచేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని, అతడి ఇంటి నుంచి కొన్ని డిజిటల్ పరికరాలు, రహస్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భారత నౌకాదళానికి చెందిన సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల మొహరింపు సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్టు గత ఏడాది డిసెంబరు 20న ఏపీ నిఘా విభాగం బయటపెట్టింది. దీనికి ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’ అని నామకరణం చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్టు కాగా.. వారిలో పాకిస్థాన్‌లో జన్మించిన షాయిస్తా క్వయిజర్‌ అనే యువతి కూడా ఉంది.


By September 15, 2020 at 12:07PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nia-one-more-arrest-in-operation-dolphin-nose-case-gujrat-man-who-touch-with-pakistan-spies/articleshow/78120942.cms

No comments