విజయవాడలో రైడింగ్ ఎక్కువైందని.. రూటు మార్చిన వ్యభిచార ముఠా.. కనిపెట్టిన ఖాకీలు

విజయవాడలో పోలీస్ రైడింగ్ ఎక్కువైందని వ్యభిచార ముఠా రూటు మార్చింది. జిల్లాలోని ద్వితీయ శ్రేణి పట్టణాలను టార్గెట్ చేసుకుంది. ఎంచక్కా బ్యూటీపార్లర్ ముసుగులో సెక్స్ దందా స్టార్ట్ చేసింది. ఇల్లు అద్దెకు తీసుకుని బ్యూటీపార్లర్ నడుపుతున్నట్లు నమ్మించిన నిర్వాహకురాలు.. ఫోన్‌లో అమ్మాయిల ఫొటోలు పంపించి విటులను ఆకర్షించేది. విషయం తెలుసుకున్న అవనిగడ్డ పోలీసులు సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. విజయవాడకు చెందిన వ్యభిచార కేంద్ర నిర్వాహకురాలు బ్యూటీపార్లర్ ముసుగులో సెక్స్ దందా నిర్వహించేది. ఇటీవల నగరంలో పోలీసు దాడులు పెరిగిపోవడంతో మరో మహిళ సాయంతో అవనిగడ్డకు మకాం మార్చింది. బ్యూటీపార్లర్ పేరుతో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార దందా ప్రారంభించింది. మొబైల్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపించి విటులను ఆకర్షించి రప్పించేది. Also Read: వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు ఉప్పందడంతో బ్యూటీపార్లర్‌పై దాడులు చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలు, వారికి సహకరిస్తున్న మరో ఇద్దరు, ఒక విటుడిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన నిర్వాహకురాలు, ఆమెకు సహకరిస్తున్న మహిళపై ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఒక మహిళను వ్యభిచార కూపం నుంచి రక్షించి ఆమె బంధువులకు అప్పగించారు. Read Also:
By September 18, 2020 at 11:42AM
No comments