ప్రియుడి కోసం గడప దాటిన తల్లి.. పసిబిడ్డలు బలి.. చిత్తూరులో ఘోరం

చిత్తూరులో ఘోరం చోటుచేసుకుంది. తల్లితో పిల్లల ప్రాణాలు బలితీసుకుంది. తన కోసం ఇంటి నుంచి వచ్చేసిన వివాహితను తీసుకెళ్లిన ప్రియుడు.. ఆమె పిల్లలను అడ్డుగా భావించాడు. అర్ధరాత్రి వేళ ఘాతుకానికి పాల్పడ్డాడు. చెరువులో విసిరేసి కవల సోదరులు ప్రాణాలు తీశాడు. ఈ అత్యంత అమానుష ఘటన జిల్లా నియోజకవర్గంలో జరిగింది. పులిచెర్ల మండలం రామిరెడ్డిగారిపల్లెకి చెందిన వెంకటేశ్వరరెడ్డికి అదే ప్రాంతానికి చెందిన హేమశ్రీతో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వారికి కవలలు పునర్వి రెడ్డి, పునీత్ రెడ్డి సంతానం. కొద్దికాలంగా హేమశ్రీకి అదే గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియురాలిపై మోజుతో ఉదయ్ కుమార్ తనతో వచ్చేయాలని ఒత్తిడి చేసేవాడు. రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో ఆమె ఒప్పుకుంది. అర్ధరాత్రి వేళ తన పసిబిడ్డలను వెంటబెట్టుకుని గడప దాటింది. ప్రియుడి ఆటోలో ఊరి నుంచి బయల్దేరారు. అయితే ప్రియురాలి పిల్లలను అడ్డుగా భావించిన ఉదయ్ కుమార్ దారుణానికి ఒడిగట్టాడు. సదుం మండలం చింతపర్తివారిపల్లె సమీపంలోని నడిమోడుకుంటలో ఇద్దరు పసిబిడ్డలను అమానుషంగా చెరువులో విసిరేశాడు. ప్రియుడి ఘాతుకంతో భయాందోళనకు గురైన హేమశ్రీ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక ఉదయ్ కుమార్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. Also Read: మరుసటి రోజు ఉదయం చిన్నారుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీయించారు. ఆధారాల కోసం చుట్టుపక్కల గాలించడంతో సమీపంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఉదయ్ కుమార్, హేమశ్రీ కనిపించారు. వెంటనే వారిని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Read Also:
By September 16, 2020 at 09:59AM
No comments