Breaking News

అత్తారింటి‌ నుంచి వస్తూ నవవరుడి మృతి.. చిత్తూరులో విషాదం


జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లైన తర్వాత ఐదో శుక్రవారం జరిగే వేడుకల కోసం అత్తారింటికి వెళ్లిన అల్లుడు తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన రొంపిచెర్ల మండలం చెంచమరెడ్డిగారిపల్లె సమీపంలో జరిగింది. సదుం మండలం లక్ష్మీనగర్‌కి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు చాంద్‌బాషా(28) బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 11న చాంద్‌బాషాకి రొంపిచెర్ల చిన్న మసీదు వీధికి చెందిన షమీర్ ఖాన్ కుమార్తో సోనియాతో వివాహం జరిగింది. సదుంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో పెళ్లి అనంతరం జరగాల్సిన ఐదో శుక్రవారం వేడుకలను వధువు సోనియా పుట్టింట్లో నిర్వహించారు. వేడుకల కోసం నవ దంపతులు రొంపిచెర్ల వచ్చారు. అనంతరం ఇద్దరూ బైక్‌పై లక్ష్మీనగర్ బయల్దేరారు. మార్గం మధ్యలో చెంచమరెడ్డిగారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. Also Read: వైపు నుంచి వేగంగా వస్తున్న టాటా ఏస్ వాహనం బైక్‌ని ఢీకొట్టడంతో కిందపడి భార్యాభర్తలకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108కి సమాచారం అందించడంతో వెంటనే పీలేరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలిస్తుండగా నవ వరుడు చాంద్‌బాషా మృతి చెందాడు. కళ్లెదుట కట్టుకున్న వాడు ప్రాణాలు కోల్పోవడంతో నవవధువు రోధిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఈ ఘటనతో వధూవరుల ఇంట తీవ్రవిషాదం నెలకొంది. Read Also:


By September 13, 2020 at 10:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/groom-killed-in-road-accident-in-chittoor/articleshow/78085761.cms

No comments