Breaking News

ఢిల్లీ: దొంగల్ని వెంబడించి పట్టుకున్న మహిళా జర్నలిస్ట్.. ఫిదా అయిన పోలీసులు


ద్విచక్రవాహనంపై వచ్చి తన మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోతున్న ఇద్దరు దొంగల్ని ఓ మహిళా జర్నలిస్ట్ వెంబడించి పట్టుకున్న ఘటన ఢిల్లీలో శనివారం చోటుచేసుకుంది. ఆ మహిళా జర్నలిస్ట్‌ చూపిన తెగువ, ధైర్యానికి పోలీసులు ఫిదా అయ్యారు. ఆమెను పోలీస్ స్టేషన్‌లో సత్కరించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దూరదర్శన్‌లో పనిచేస్తోన్న మహిళా జర్నలిస్ట్.. శనివారం మధ్యాహ్నం ఆటోరిక్షాలో దక్షిణ ఢిల్లీలోని మాలవ్వా నగర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఈశాన్య ఢిల్లీ డీసీపీ ఆర్పీ మీనా వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆటోరిక్షాలో వెళ్తున్న ఆమె చేతిలోని మొబైల్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. జర్నలిస్ట్ ప్రతిఘటించి, వెంబడించడంతో నిందితుల ద్విచక్రవాహనం పోలీస్ బారికేడ్ తగిలి పడిపోయింది. ఆటోడ్రైవర్ సాయంతో వారిని దగ్గర్లోని పోలీసులకు అప్పగించింది. నిందితులను తుగ్లకాబాద్‌కు చెందిన యువకులుగా గుర్తించారు. డ్రగ్స్‌కు బానిసలైన వీరు డబ్బుల కోసం ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు.


By September 14, 2020 at 08:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/phone-snatched-by-thieves-on-bike-womean-journalist-chases-catches-them-in-delhi/articleshow/78097969.cms

No comments