Breaking News

కోవిడ్ కేసులో మరో రికార్డ్.. అమెరికా, బ్రెజిల్ సరసన భారత్


ప్రపంచంలో కోవిడ్ కేసులు మూడు మిలియన్ మార్క్ దాటిన దేశాల్లో భారత్ నిలిచింది. ఇప్పటి వరకూ అమెరికా, బ్రెజిల్‌ల్లోనే పాజిటివ్ కేసులు మూడు మిలియన్లు దాటాయి. అమెరికాలో 5.8 మిలియన్లు, బ్రెజిల్‌లో 3.5 మిలియన్ల మంది ఇప్పటి వరకూ వైరస్ బారినపడ్డారు. శనివారం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 70,400 కొత్త కేసులు బయటపడ్డాయి. మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో బాధితుల సంఖ్య 30,40,597కి చేరింది. గత బుధవారం దేశంలో అత్యధికంగా 70,101 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. శనివారం ఆ రికార్డు కనమరుగయ్యింది. గడచిన ఐదు రోజులతో పోల్చితే మరణాలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా 917 మంది శనివారం ప్రాణాలు కోల్పోయారు. అయితే, అత్యంత వేగంగా భారత్‌లో కేసులు మూడు మిలియన్లకు చేరుకున్నాయి. అయితే, అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే యాక్టివ్ కేసులు తక్కువగా ఉండటం సానుకూలంశం. అమెరికాలో 16 లక్షలు, బ్రెజిల్‌లో 8 లక్షలు యాక్టివ్ కేసులు ఉంటే.. భారత్‌లో ఇవి 7.1 లక్షగా ఉన్నాయి. శనివారం అత్యధికంగా మహారాష్ట్రలో 14,492 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. యూపీ (5,375), తెలంగాణ (,2474), గుజరాత్ (1,212), మధ్యప్రదేశ్ (1,226) ఒక్క రోజు గరిష్ఠ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో మొత్తం బాధితుల సంఖ్య 6,71,942గా ఉంది. మహరాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు మరోసారి 10వేలు దాటాయి. 13 రోజుల తర్వాత 10వేల కేసులు శనివారం నిర్ధారణ అయ్యాయి. దీంతో ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,216కి చేరింది.


By August 23, 2020 at 09:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-indias-positive-case-count-tops-3m-biggest-spike-on-sat/articleshow/77699852.cms

No comments