Breaking News

నెలల తరబడి ఖాళీగా అపార్ట్‌మెంట్.. కానీ బాత్రూంలో కరోనా.. విస్తుగొలుపుతున్న పరిశోధన


కోవిడ్ ప్రధానంగా తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుందనే సంగతి తెలిసిందే. కానీ టాయిలెట్ల ద్వారానూ కోవిడ్ వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. చైనాలోని గ్వాంగ్జౌలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ చాలా కాలంగా ఖాళీగా ఉంటోంది. కానీ ఆ అపార్ట్‌మెంట్ బాత్రూమ్‌లో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. బాత్‌రూమ్‌లోని సింక్, నీళ్ల పైపు, షవర్ హ్యాండిల్‌‌లో కోవిడ్ ఆనవాళ్లు కనిపించాయి. నెలల తరబడి వాడనప్పటికీ ఆ బాత్‌రూమ్‌లో కరోనా ఆనవాళ్లను గుర్తించినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. నీరు, వ్యర్థాలను తీసుకెళ్లే డ్రైన్ పైపుల ద్వారా ఈ వైరస్ ఆ బాత్‌రూమ్‌లోకి చేరి ఉంటుందని భావిస్తున్నారు. ఆ అపార్ట్‌మెంట్‌లోని వేరే అంతస్తులో రెండు కరోనా కేసులను గుర్తించారు. కరోనా పేషెంట్ల మల, మూత్రాల ద్వారా డ్రైన్‌లోకి వెళ్లిన కరోనా కణాలు.. ప్లంబింగ్ ద్వారా వేరే అంతస్తులోని బాత్‌రూమ్‌లోకి చేరి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో వేస్ట్ వాటర్ బయటకు వెళ్లిపోవడానికి పైపులు ఒకదానికొకటి లింకై ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటి ద్వారానే కోవిడ్ ఒక అంతస్తులోని బాత్రూమ్‌లో నుంచి మరో అంతస్తులోని బాత్రూమ్‌లోకి ఎగబాకుతున్నట్లు భావిస్తున్నారు. మల విసర్జన తర్వాత చేసే సాధారణంగా ప్లష్ చేస్తుంటారు. వైరస్ క్రిముల కూడిన గాలి తుంపర్లను వ్యాప్తి చెందడానికి ఈ ప్లష్ కారణం అవుతోందని ఇంతకు ముందు పరిశోధనలో చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌తో కూడిన ఈ కణాలు గాలిలో చాలా కాలంపాటు ఉండటంతోపాటు.. మీటరు దూరం వరకు వ్యాప్తి చెందుతాయి. ఇరుకుగా, గాలి తగినంత సోకని ప్రదేశాల్లో ఇవి ఎక్కువ సేపు ఉంటాయని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో కరోనా బారిన పడిన 73 మంది మలాన్ని పరిశీలించగా.. అందులో సగానికిపైగా మలం శాంపిళ్లు కరోనా పాజిటివ్ అని తేలింది. Read Also: ఇటీవల విమాన ప్రయాణం చేసిన 28 ఏళ్ల ఓ యువతి కరోనా బారిన పడింది. కరోనా సోకినప్పటికీ.. ఎలాంటి లక్షణాలు లేని ఓ ప్యాసింజర్ ఆమెకు దూరంగా కూర్చుంది. ఎన్-95 మాస్క్ ధరించినప్పటికీ ఆ యువతి కోవిడ్ బారిన పడింది. ప్రయాణ సమయంలో కరోనా సోకిన ప్యాసింజర్ వాడిన టాయిలెట్‌ను ఆమె కూడా వాడమటే కరోనా సోకడానికి కారణంగా భావిస్తున్నారు. Watch Video:


By August 28, 2020 at 09:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-discovered-in-the-bathroom-of-an-unoccupied-apartment-in-china/articleshow/77796990.cms

No comments