Breaking News

గిద్దలూరు: అర్ధరాత్రి వివాహిత అనుమానాస్పద మృతి.. ప్రియుడిపై అనుమానాలు


ప్రకాశం జిల్లాలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. మండలం పొదలకుంటపల్లె సచివాలయంలో సోషల్‌ వెల్ఫేర్‌ సహాయకురాలిగా పనిచేస్తున్న గద్దె నాగమణి (35) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. గిద్దలూరు నగర పంచాయతీ పిడతల రాంభూపాల్‌రెడ్డి కాలనీలో అద్దెకుంటున్న నాగమణి రోజూ సచివాలయంలో విధులకు హాజరవుతుంటారు. ఆమెకు ఆర్మీలో పనిచేసే పి.రమేష్‌‌తో 16 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. Also Read: నాగమణి తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఉద్యోగం చేస్తోంది. భర్త ఆరు నెలల కిందట విధుల నుంచి ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం ఆమె ఆఫీసుకి వెళ్లి.. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు. రాత్రి అయినా ఆమె ఇంటికి రాకపోవడంతో భర్త రమేష్, తండ్రి వెంకటేశ్వర్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో నాగమణి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గిద్దలూరు పోలీసులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. Also Read: దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లిన కుటుంబసభ్యులు విగతజీవిగా ఉన్న నాగమణిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతురి చావుకు కోటేశ్వరరావు అనే వ్యక్తి కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమణి ఇంటి పక్కనే గతంలో కంచిపల్లె పంచాయతీ రాజుపేట గ్రామానికి చెందిన కోటేశ్వరరావు అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. భర్త ఆర్మీలో ఉండటంతో నాగమణి అతడి ఆకర్షణలో పడింది. పిల్లలను కూడా పట్టించుకోకుండా కోటేశ్వరరావుతో చనువుగా ఉంటుండేది. దీంతో పద్ధతి మార్చుకోవాలని నాగమణిని తల్లిదండ్రులు మందలించారు. Also Read: ఆ తర్వాత కోటేశ్వరావు కూడా ఆ ఇంటికి ఖాళీ చేసి వేరే చోటికి వెళ్లిపోయాడు. అయితే తమ బిడ్డ మృతికి కోటేశ్వరరావుపై అనుమానం ఉన్నట్లు తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఆమె మృతదేహానికి గిద్దలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే నాగమణిని శుక్రవారం అర్ధరాత్రి రాజుపేట గ్రామం నుంచి ఆటోలో తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారనే వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో హాస్పిటల్‌కు తీసుకొచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటేశ్వరరావును విచారిస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By August 30, 2020 at 08:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-suspected-death-in-prakasam-district-case-booked/articleshow/77830151.cms

No comments