ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

రాజస్థాన్లో ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో శిధిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీశారు. వీరిలో నలుగురు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అల్వాల్ జిల్లా కైమాలా గ్రామానికి చెందిన అలీముద్దీన్ కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి నిద్రపోతున్న సమయంలో అకస్మాత్తుగా ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అలీముద్దీన్తో పాటు అతని ముగ్గురు పిల్లలు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అలీముద్దీన్ భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో అలీముద్దీన్, ఆయన కుమార్తెలు షబ్నాబ్, సానియా, నెల రోజుల బాబు ప్రాణాలు కోల్పోయారు.
By August 24, 2020 at 08:28AM
No comments