విశాఖ: మహిళా వాలంటీర్‌కు లైంగిక వేధింపులు.. ప్రశ్నించిన భర్త, మరిదిపై దాడి

విశాఖ నగరంలో దారుణం జరిగింది. మహిళా వాలంటీర్‌ను లైంగికంగా వేధిస్తున్నందుకు ప్రశ్నించిన ఆమె భర్త, మరిదిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. భీమిలి మండలం జీవీఎంసీ నాలుగో వార్డు నేర్లవలసలో ఈ ఘటన జరిగింది. చిన్నా అలియాస్ మాస్(28) దాడిలో వార్డు వాలంటీరు భర్త శ్రీనివాస్(28), మరిది ప్రసాద్(26) తీవ్రంగా గాయపడ్డారు. నేర్లవలసలో వాలంటీర్‌గా పనిచేస్తున్న మహిళను చిన్నా కొంతకాలంగా వెంటపడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె భర్త శ్రీనివాస్‌కు చెప్పడంతో మూడు రోజుల కిందట గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. Also Read: అయితే ఆమెను తాను వేధించడం లేదని సచివాలయంలోని ఓ ఉద్యోగి వేధిస్తున్నట్లు ఆమె భర్తే తనకు చెప్పాడని మాస్ పెద్దలకు వివరించాడు. ఇదే విషయమై మాస్‌కి... అన్నదమ్ములైన శ్రీనివాస్, ప్రసాద్‌లకు మధ్య గురువారం సాయంత్రం గొడవ జరిగింది. ఈ క్రమంలో మాస్ తన ఇంట్లోని కత్తితో వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ ఎడమచేయి మణికట్టు తెగిపడగా... కుడివైపు పొట్టపై మూడు అంగుళాల మేర కత్తి గాటు పడింది. ప్రసాద్ రెండు చేతుల్లోని వేళ్లకు గాయాలయ్యాయి. తలపైనా బలమైన గాయమైంది. బాధితులకు భీమిలి ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశాక విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. Also Read: శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని కేజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. మరోవైపు శ్రీనివాస్, ప్రసాద్ తనను రాడ్‌తో తలపై కొట్టారంటూ నిందితుడు చిన్నా సంగివలసలోని ఆస్పత్రిలో చేరాడు. రెండు వర్గాల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాడని, సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. Also Read:
By August 28, 2020 at 10:24AM
No comments