Breaking News

ఫ్రెండ్‌ ఇంటికి తీసుకెళ్లి ప్రియురాలిపై రేప్.. 10 రోజుల తర్వాత ఆస్పత్రిలో


ప్రేమ పేరుతో కాలేజీ అమ్మాయి వెంటపడిన యువకుడు చివరికి ఆమెను ట్రాప్‌లో వేసుకున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఆమెను కొన్నాళ్లుగా కలుసుకోలేకపోయాడు. కొద్దిరోజుల క్రితం కాలేజీకి వచ్చిన యువతిని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లిన ఆ కామాంధుడు ఆమెను బెదిరించి చేశాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతిపై ప్రియుడితో పాటు అతడి ఫ్రెండ్‌ కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పరారీలో ఉన్న ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read: తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లా నట్రంపల్లికి చెందిన యువతి(17) జంగలపురం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన రాహుల్‌(20) అనే డిగ్రీ విద్యార్థి ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. కొద్దిరోజులకు తర్వాత ఆమె కూడా ఓకే చెప్పేయడంతో ఇద్దరూ షికార్లకు తిరిగేవారు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కొద్ది నెలలుగా ప్రేమజంట కలుసుకోవడం కుదరడం లేదు. పది రోజుల క్రితం యువతి ఓ పని నిమిత్తం కాలేజీకి వెళ్లింది. Also Read: ఈ విషయం తెలుసుకున్న రాహుల్ మాట్లాడుకుందామని నమ్మించి ప్రియురాలిని తన ఫ్రెండ్ జీవా ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అవకాశంగా భావించిన రాహుల్ ప్రియురాలికి మాయమాటలు చెప్పి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాత్రి పొద్దుపోయాక ఇంటికి వచ్చిన కూతురిని తల్లిదండ్రులు నిలదీయగా ఏమీ చెప్పకుండా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. తెల్లారేసరికి గదిలో ఉరేసుకుని కనిపించిన ఆమెను కుటుంబసభ్యులు చూసి షాకయ్యారు. వెంటనే తిరుపత్తూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. Also Read: అక్కడ పరిస్థితి విషమించడంతో ధర్మపురిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 10 రోజుల పాటు చికిత్స పొందిన బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.తమ కూతురిపై జరిగిన దారుణంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి చనిపోయిందన్న విషయం తెలుసుకున్న రాహుల్, జీవా పరారయ్యారు. వారిద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:


By August 31, 2020 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-rapes-girlfriend-in-friend-house-in-tamil-nadu/articleshow/77844783.cms

No comments