Breaking News

అదే శ్రీరామ రక్ష.. ప్రజలకు టాలీవుడ్ హీరోల శుభాకాంక్షలు


తెలుగు ప్రజలకు పండుగలు ఎంతో ప్రత్యేకం. ప్రతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఈసారి పండుగలు కూడా జరుపుకోలేని పరిస్థితి. ఇప్పటికే కరోనా వల్ల ఉగాది పండుగను తెలుగు ప్రజలు జరుపుకోలేకపోయారు. ఈరోజు శ్రీరామ నవమిని కూడా గతంలో మాదిరిగా జరుపుకోవడంలేదు. ఎవరి ఇంట్లోనే వారు ఆ సీతారాములకు దండం పెట్టుకుని ఊరుకుంటున్నారు. అయితే, ఇలా చేయడమే ఉత్తమం అంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. నేడు శ్రీరామ నవమి సందర్భంగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, శర్వానంద్, మంచు మనోజ్, మంచు విష్ణు సహా దర్శకులు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, కోన వెంకట్ తదితరులు ట్విట్టర్ ద్వారా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇంటిపట్టునే ఉండండి. మీ ఆరోగ్యానికి అదే శ్రీరామ రక్ష’’ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘‘మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఇంట్లోనే ఉండండి.. భద్రంగా ఉండండి’’ అని కళ్యాణ్ రామ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాముడిని ప్రార్థిస్తే సరిపోదని.. ఆయన సూచించిన ‘ధర్మం’ అనే మార్గంలో అందరూ నడవాలని మంచు మనోజ్ ట్విట్టర్ ద్వారా సూచించారు. తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. అందరిపై ఆ శ్రీరామ చంద్రుడు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఇక మంచు మనోజ్ కాస్త వెరైటీగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అఖిల భారత హనుమాన్ అభిమానుల సంఘం అధ్యక్షుడిగా విష్ణు మంచు ప్రేమతో శ్రీరాముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై శ్రీరామ్’’ అని విష్ణు ట్వీట్ చేశారు.


By April 02, 2020 at 12:14PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/jr-ntr-and-other-tollywood-celebs-sri-rama-navami-wishes-to-telugu-people/articleshow/74944113.cms

No comments