Breaking News

సచివాలయ ఉద్యోగులను చితకబాదిన ఎస్ఐ.. నెల్లూరులో దారుణం


జిల్లాలోని కపాడిపాళెంలో సచివాలయంఉద్యోగిపై, వార్డు వాలంటీర్‌పై సంతపేట ఎస్‌ఐ వెంకటరమణ గురువారం దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఎస్ఐ తీరుకు నిరసనగా సచివాలయ ఉద్యోగులు, స్థానికులు ‌పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమాచారం మేరకు కపాడిపాళెంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉన్న గ్రామ సచివాలయంలో బాబురావు పనిచేస్తున్నాడు. అక్కడే సోని సంపన్నకుమార్‌ వార్డు వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం వారిద్దరు గ్రామంలోని ప్రజలకు పెన్షన్లు అందచేసి తిరిగి సచివాలయానికి వస్తున్నారు. Also Read: ఇదే సమయంలో సంతపేట ఎస్‌ఐ వెంకటరమణ, కొందరు కానిస్టేబుళ్లు అటువైపుగా వస్తూ రోడ్లపై ఉన్న ప్రజలను ఇళ్లలోకి వెళ్లాలంటూ సూచిస్తున్నారు. ఈ సమయంలో కానిస్టేబుళ్లు ఓ మహిళపై దాడి చేస్తుండగా వాలంటీర్ సంపన్నకుమార్‌ తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సచివాలయానికి వెళ్లిపోయాడు. దాన్ని గమనించిన ఎస్‌ఐ వెంకటరమణ నేరుగా సచివాలయంలోకి వెళ్లి అతడిని చితకబాదుతూ బయటకు లాక్కొచ్చాడు. పక్కనే ఉన్న బాబూరావు తాము ప్రభుతవ ఉద్యోగులమంటూ ఐడీ కార్డులు చూపించడంతో ఎస్ఐ మరింత రెచ్చిపోయాడు. వాడికే సపోర్ట్ చేస్తావా అంటూ బాబూరావుపైనా దాడిచేసి ఇద్దరినీ జీప్ ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లాడు. Also Read: ఈ విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు, స్థానికులు పెద్ద సంఖ్యలో సంతపేట పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఎస్‌ఐ వెంకటరమణ గతంలోనూ అనేకసార్లు ప్రజలపై అమానుషంగా దాడికి పాల్పడిన దాఖలాలున్నాయని, గర్భిణీలు, బాలింతలని కూడా చూడకుండా మహిళలను చితకబాదుతాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్‌ను లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తుంటే తమపై దాడి చేయడం ఎంత వరకు సబబని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ వెంకటరమణ కొద్ది రోజుల క్రితమే ఓ జర్నలిస్టుపై దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొద్ది రోజులు గడవక ముందే సచివాలయ ఉద్యోగులపై దాడి చేయడం వందలాది మంది ప్రజలు అతనికి వ్యతిరేకంగా నిరసనలు దిగడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. Also Read:


By April 03, 2020 at 07:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/santhapet-si-beats-village-secretariat-employees-in-nellore-district/articleshow/74958785.cms

No comments