వివాహిత అనుమానాస్పద మృతి.. భర్తే చంపాడంటున్న తల్లిదండ్రులు

జిల్లా మండలం వేపులబైలు పంచాయతీ బండమీద హరిజనవాడకు చెందిన రెడ్డి పద్మజ(24) మృతి ఘటన మరో మలుపు తీసుకుంది. తొలుతు ఆమెది ఆత్మహత్యగా అందరూ భావించగా.. అత్తింటి వారే తమ కూతురిని చంపేసి నాటకమాడుతున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా సుండుపల్లెకు చెందిన వెంకటరమణ పెద్ద కుమార్తె రెడ్డి పద్మజను బండమీద హరిజనవాడకు చెందిన రైల్వే గేట్‌మాన్ ఎం.శివకృష్ణకు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. కట్న కానుకల కింద రూ.3 లక్షల నగదు, 15 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. Also Read: వివాహమైన మూడు నెలల తరువాత అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు పద్మజను వేధించసాగారు. సోమవారం మధ్యాహ్నం పద్మజ భోజనం చేయలేదని ఆమె అత్త రెడ్డమ్మ ఫోన్ చేసి చెప్పగా తమ కూతురికి నచ్చజెప్పామని, మధ్యాహ్నం 4 గంటల సమయంలో రాఘవ అనే వ్యక్తి ఫోను చేసి వెంటనే పీలేరుకు బయలుదేరి రమ్మన్నాడని పద్మజ తల్లిదండ్రులు తెలిపారు. Also Read: పీలేరు ప్రభుత్వాసుపత్రిలో పద్మజ విగతజీవిగా కనిపించడంతో అల్లుడిని నిలదీయగా.. ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే కోపంతో వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న శివకృష్ణ కుటుంబసభ్యులతో కలిసి పరారయ్యాడు. దీంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. Also Read:
By April 02, 2020 at 11:32AM
No comments