గత 75 ఏళ్లలో ఎన్నడూ చూడని సంక్షోభం.. 2.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు

విషయంలో ప్రపంచదేశాలను మరోసారి హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ప్రపంచం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత గత 75 ఏళ్లలో ఈ స్థాయి సంక్షోభాన్ని ఎప్పుడూ చూసి ఉండమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. ఆర్థిక రంగంపై దాని ప్రభావం అత్యంత అస్థిరత, అశాంతి, ఆందోళనలకు దారితీయబోతోందని గుటెరస్ ఉద్ఘాటించారు. ‘సామాజి ఆర్థిక పరిస్థితులపై కొవిడ్-19 ప్రభావం’నివేదిక విడుదల సందర్భంగా యూఎన్ సెక్రెటరీ జనరల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌పై పోరాటాన్ని ప్రపంచ దేశాలు మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని గుటెరస్ అభిప్రాయపడ్డారు. రాజకీయ విభేదాలు, సిద్ధాంతాలను పక్కనబెట్టి అందరూ ఏకతాటిపైకి వస్తేనే ఈ మహమ్మారి సృష్టించే ఉత్పాతాన్ని సమర్థంగా ఎదుర్కోగలమని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 75 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదిక అభిప్రాయపడింది. ఇది కేవలం ఆరోగ్య రంగానికే పరిమితం కాకుండా మానవ సంక్షోభానికి కూడా దారితీస్తుందని వక్కాణించింది. కోవిడ్-19ను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యల్లో ఇంకా చాలా వెనుకబడి ఉన్నామని.. ఎవరికి వారు సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారని..డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల్ని పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు సమూకూర్చుకోలేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని మరోసారి పిలుపునిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో కూలిపోయే ఆర్ధిక వ్యవస్థలకు ఊతం ఇవ్వడానికి వరకు ఐదు ట్రిలియన్ డాలర్లు సమీకరించినా, ఇందులో అధిక భాగం అమెరికా రెండు ట్రిలియన్ డాలర్లు సహా అభివృద్ధి చెందిన దేశాలకే అవసరమవుతాయని అన్నారు. వ్యాధిని కట్టడి చేయడానికి, వివిధ దేశాల్లో ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి, ఉద్యోగాలు కోల్పోయినవారు, అదృశ్యమయ్యే ముప్పు పొంచి ఉన్న చిన్నతరహా పరిశ్రమలకూ ఊతమివ్వడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయపడటానికి ప్రత్యేక ప్యాకేజీ అందుబాటులో ఉందని, అనధికారిక ఆర్థిక వ్యవస్థలకు మనుగడకు అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం.. 2020లో 5 నుంచి 25 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని, దీని వల్ల 860 మిలియన్ల నుంచి 3.4 ట్రిలియన్ డాలర్ల మేర కార్మికుల ఆదాయానికి గండిపడుతుంది. అలాగే, ఐరాస వాణిజ్య, అభివృద్ధి మండలి కూడా ఈ ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల 30 నుంచి 40 శాతం తగ్గుతాయని అంచనా వేసింది.
By April 01, 2020 at 11:49AM
No comments