Breaking News

130 కోట్ల మంది ఈ సమయాన్ని నాకు ఇవ్వండి.. మోదీ వీడియో సందేశం


నియంత్రణకు విధించిన 21 రోజుల లాక్‌డౌన్ దేశవ్యాప్తంగా కొనసాగుతుండగా.. శుక్రవారం మరోసారి వీడియో సందేశం ఇచ్చారు. 130 కోట్ల మంది ప్రజలు ఈ సమయాన్ని తనకు ఇవ్వాలంటూ మోదీ వీడియో సందేశంలో కోరారు. కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూ ద్వారా భారతీయులంతా శక్తి సామర్ధ్యాలను చాటారని కితాబిచ్చారు. దేశమంతా ఏకమైన కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొడతారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం మన మార్గంలోనే నడుస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటేనే కరోనాను జయించగలమని అన్నారు. తాము ఒక్కరమే ఇంట్లో ఉంటే వైరస్‌‌ను ఎలా నియంత్రించగలమని అనుకోవద్దని ప్రధాని పేర్కొన్నారు. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆపేసి, మొబైల్ టార్చ్ కూడా ఆన్ చేయవద్దని, తలుపులు మూసేసి గుమ్మం ముందు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలని సూచించారు. దేశ ప్రజలంతా బాల్కనీలోకి వచ్చి కొవ్వెత్తులు, ప్రమిదలతో దివ్వెలను వెలిగించి, కరోనాను తిప్పికొడతామని సంకల్పం తీసుకోవాలని మోదీ ఉద్ఘాటించారు. ఈ సంకట సమయంలో భారతీయులకు ఇది శక్తి, ఉత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. సంకల్పాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేదీ లేదని.. అందరూ కలిసి వచ్చి.. కరోనాను ఎదుర్కొండని కోరారు. కరోనా పై యుద్ధంలో అందరూ సహకరించాలని ప్రధాని మోడీ మరోసారి అభ్యర్థించారు.


By April 03, 2020 at 09:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-naredra-modi-shares-video-message-on-fight-against-coronavirus/articleshow/74959897.cms

No comments