పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాత ఆత్మహత్య... సూసైడ్ వీడియోలో షాకింగ్ విషయాలు

కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, ఫైనాన్షియర్ మోహన్ అలియాస్ కపాలి మోహన్(58) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గంగమ్మగుడి పీఎస్ పరిధిలోని బసవేశ్వర కె.ఎస్.ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో ఫ్యాన్‌కు ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కన్నడ పరిశ్రమతో సత్సంబంధాలు కలిగిన ఆయన బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఆర్థిక సమస్యలే దీనికి కారణంగా తెలుస్తోంది. Also Read: ఆదివారం రాత్రి స్నేహితుడితో కలిసి భోజనం చేసిన ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత కొడుకుతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు. ‘అందరికీ నమస్కారం. నేను బసవేశ్వర కె.ఎస్.ఆర్టీసీ బస్టాండు వద్ద సింగల్ బిడ్ టెండర్ తీసుకుని అందులో కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టాను. అందులో దానివల్ల నాకు ఎంతో నష్ట్ వచ్చింది. ఏడేళ్ల నుంచి అనేకసార్లు విన్నవించుకుంటున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాను. అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు అధికారులు నా ఆస్తుల్ని జప్తు చేశారు. ఇళ్లు, ఇతర ఆస్తుల్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని విధాలుగా ఓడిపోయాను. దయచేసి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రయత్నిస్తారని నమ్మకం ఉంది’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు. Also Read: సోమవారం ఉదయం గంగమ్మగుడి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఎం.ఎస్.రామయ్య ఆసుపత్రికి తరలించారు. కపాలి మోహన్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి 2018లో సీసీబీ పోలీసులు, 2019లో ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అక్రమ నగదు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల రాజప్రస్థానం మైదానంలో కుమార్తె వివాహాన్ని వైభవంగా చేశారు. దీనికి రాజకీయ, సినీ ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. అనేక సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఆయన ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By March 24, 2020 at 09:46AM
No comments