కరోనా వైరస్ లైవ్ అప్డేట్స్: కరోనా దెబ్బకు విలవిలలాడుతోన్న అగ్రరాజ్యం

⍟ లక్ష దాటడానికి 67 రోజు పడితే, రెండో లక్ష 11 రోజుల్లోనూ, మూడో లక్ష నాలుగు రోజుల్లోనే చేరింది. ప్రస్తుతం రోజుకు సగటున 66వేల కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని బలైనవారి సంఖ్య 30వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 6.66 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 3వేలకు మృతిచెందారు. వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,42,000 మంది కోలుకున్నారు. మరో 4.65 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 25,200 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ⍟ దేశంలో కరోనా వైరస్ మరో దశలోకి ప్రవేశించినట్టు ప్రస్తుతం నమోదవుతున్న కేసులు వెల్లడిస్తున్నాయి. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంపై ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వైరస్ నియంత్రణలో భాగంగా విధించిన దేశవ్యాప్త 21 రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది. కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 1,000 దాటింది. వారం రోజుల్లోనే దేశంలో కొత్తగా దాదాపు 800 కేసులు నమోదయ్యాయి. ⍟ కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోవిడ్‌కు అడ్డుకట్ట వేయడం కోసం భారత్ మూడు వారాలపాటు లాక్డౌన్ ప్రకటించింది. అత్యవసరంగా వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలను తెప్పిస్తోంది. కోవిడ్‌పై పోరాటానికి భారత్ చేస్తున్న కృషిని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. కరోనాను కట్టడి చేయడం కోసం కృషి చేస్తున్న కేంద్ర, రాష్ట్రాలకు పలువురు ప్రముఖులు భారీ మొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. ⍟ కరోనా వైరస్ ప్రభావంతో ఇటలీ విలవిల్లాడుతోంది. ఈ యూరోపియన్ దేశంలో ప్రాణ నష్టం ఊహకు అందని రీతిలో అంతకు అంతకూ పెరుగుతోంది. ఇటలీలో కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య పది వేలు దాటిందని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది. ఒక్కరోజులోనే ఇటలీలో దాదాపు 900 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ⍟ అగ్రరాజ్యం కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఆ దేశంలోనే నమోదయ్యాయి. ఇప్పటికే ఆ దేశంలో పాజిటివ్ కేసులు లక్ష దాటాయి. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న న్యూ యార్క్, న్యూ జెర్సీ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావాలంటేనే వణుకుతున్నారు. కరోనా కారణంగా అమెరికాలో ఇప్పటివరకు 1929 మరణాలు చోటు చేసుకున్నాయి. శనివారం (మార్చి 28) నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,842కి పెరిగింది. ⍟ కరోనా పాజిటివ్‌గా తేలిన కొత్త గూడెం డీఎస్పీ కుమారుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై, తన కుటుంబంపై వస్తున్న వదంతులు వస్తున్నాయని, అవన్నీ అసత్యాలు, పుకార్లేనని డీఎస్పీ కుమారుడు స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్‌గా తేలిన తాను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వార్తలు వస్తు్న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ⍟ కరోనా వైరస్‌పై ప్రజల్లో క్రమంగా చైతన్యం పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితం వరకు ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ప్రజలు తాజాగా స్వచ్ఛందంగా సూచనలు అమలు చేస్తూ శభాస్ అనిపించుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది. ⍟ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ నేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రమాదం పొంచి ఉందని ముందుగానే జాగ్రత్తపడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలను సత్వరం పెంచాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటివరకూ 329 పరీక్షలు మాత్రమే చేసిందని.. రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది చాలా తక్కువ అంటున్నారు. ⍟ ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది. గుంటూరులో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో ఇద్దరికి ఇంతకు ముందే కరోనా సోకిందని నిర్ధారణ కాగా.. మరో ఇద్దరికి తాజాగా కోవిడ్ సోకిందని తేలింది. దీంతో వీరిందర్నీ క్వారంటైన్‌కు తరలించారు.
By March 29, 2020 at 09:00AM
No comments