కరోనా వైరస్ లైవ్ అప్‌డేట్స్: దాదాపు యావత్తు భారతావని లాక్‌డౌన్‌లోకి

⍟ ప్రాణాంతక కరోనా వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి చికిత్స, వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారికి విరుగుడుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ సమర్థంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తాజాగా వెల్లడించింది. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారికి నివారణ చర్యల్లో భాగంగా దీనిని వినియోగించవచ్చునని పేర్కొంది. ⍟ చైనాలో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక .. ప్రపంచవ్యాప్తంగా 197 దేశాలకు వ్యాప్తిచెందింది. అన్ని దేశాల్లోనూ విజృంభిస్తోన్న ఈ మహమ్మారి ఇప్పటికే వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. దీనికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక అన్ని దేశాలూ సతమతవుతున్నాయి. లాక్‌డౌన్‌లు పాటిస్తూ వైరస్ తీవ్రత మాత్రం పెరుగుతూ ఉంది కానీ, తగ్గుముఖం పట్టడంలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం లాక్‌డౌన్‌ల వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. చైనాలో కోవిడ్-19 తగ్గుముఖం పట్టినా మిగతా దేశాల్లో మాత్రం ఉద్ధృతంగా ఉంది. ⍟ కోవిడ్ కారణంగా దాదాపు దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధించడంతో.. షాహీన్ బాగ్ ఏరియాను క్లియర్ చేశారు. దక్షిణ ఢిల్లీలోని షాహీన్ బాఘ్.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు కేంద్ర స్థానంగా కొనసాగిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఈ ప్రాంతాన్ని సీల్ చేసిన పోలీసులు.. భద్రతను కట్టుదిట్టం చేశారు. ⍟ భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గతంతో పోలిస్తే కోవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే దేశంలో 99 నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 500కు చేరువైంది. రాష్ట్రాల్లో 498 కేసులు నమోదు కాగా.. గత మూడు రోజుల్లోనే కొత్తగా 246 మందికి కరోనా నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ⍟ కరోనా వైరస్‌పై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు పట్టించుకోవడం లేదు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు పైశాచికానందం పొందుకుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించిన పోలీసులు తాట తీస్తున్నారు. ⍟ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 31వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు కఠిన హెచ్చరికలు జారీచేశారు. ఇలాంటి విపత్కర సమయంలో అనేక ఫేక్ న్యూస్ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజూ అనేక మందికి న్యూస్ పేపర్ చదవడం అలవాటుగా ఉంటుంది. ⍟ ఆంధ్రప్రదేశ్‌లో మరో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య ఏడుకు చేరింది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి నుంచి విశాఖపట్నం జిల్లాకు వచ్చిన యువకుడికి (25) కరోనా పాజిటివ్ అని తేలింది. ⍟ కరోనా వ్యాప్తిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి విజయశాంతి ఆవేదన చెందారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించారు. కరోనా వల్ల దేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా వివేకంతో వ్యవహరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న నిబంధనలను పాటించాలని కోరారు.
By March 24, 2020 at 09:05AM
No comments