Breaking News

అప్పు ఇవ్వలేదని వృద్ధురాలి దారుణహత్య.. పరిచయస్తుడే కాలయముడు


తూర్పుగోదావరి జిల్లా నగర పంచాయతీ పరిధిలోని సాయినగర్‌లో ఈ నెల 13న సంచలనం రేపిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు చేధించారు. మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. సాయినగర్‌కు చెందిన విత్తనాల శ్యామల(65)ను ఈనెల 13న ఇంట్లో పట్టపగలు దారుణహత్యకు గురైంది. దుండగులు ఆమెను కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. Also Read: దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముమ్మిడివరం మండలం మర్లపాలెం పంచాయతీ పరిధిలోని తోట్లపాలేనికి చెందిన గుత్తుల రామకృష్ణ అలియాస్‌ చిన్నికృష్ణ నిందితుడిగా గుర్తించారు. శ్యామల కుటుంబంతో ఆయనకు మంచి సంబంధాలు ఉండడంతో అప్పుడప్పుడూ వెళ్లి చేబదులుగా డబ్బులు తీసుకుని.. కొద్దిరోజులకు మళ్లీ ఇచ్చేసేవాడు. ఈ క్రమంలోనే 13న సాయినగర్‌లోని శ్యామల ఇంటికి వెళ్లి అప్పుగా కావాలని.. డబ్బులేకపోతే బంగారమైనా ఇవ్వాలని అడగంతో ఇవ్వనని శ్యామల తిట్టిపోసింది. దీంతో ఆగ్రహించిన రామకృష్ణ బయట ఉన్న ఇటుకను తీసుకుని శ్యామల తలపై బలంగా మోదడంతో స్పృహ తప్పిపడిపోయింది. Also Read: తర్వాత ఆమెను గదిలోకి తీసుకెళ్లి మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండ దోచుకున్నాడు. స్పృహలోకి వస్తే తనను గుర్తుపడుతుందనే భయంతో కత్తిపీట తీసుకుని మెడ కోసి హత్య చేశాడు. పుస్తెలతాడును ముమ్మిడివరంలోని ఓ వడ్డీవ్యాపారి వద్ద రూ.30 వేలకు కుదువ పెట్టాడు. నల్లపూసల దండను ఇంట్లో భద్రపరిచాడు. మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. Also Read:


By March 25, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mummidivaram-police-arrested-accused-of-old-woman-murder-case/articleshow/74804006.cms

No comments