Breaking News

కరోనా ఎఫెక్ట్: షాహీన్ బాగ్‌ను క్లియర్ చేయించిన పోలీసులు


కారణంగా దాదాపు దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధించడంతో.. ఏరియాను క్లియర్ చేశారు. దక్షిణ ఢిల్లీలోని షాహీన్ బాఘ్.. సీఏఏ వ్యతిరేక ఆందోళనలకు కేంద్ర స్థానంగా కొనసాగిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. ఈ ప్రాంతాన్ని సీల్ చేసిన పోలీసులు.. భద్రతను కట్టుదిట్టం చేశారు. కరోనా వ్యాప్తి తీవ్రం అవుతున్న తరుణంలోనూ షాహీన్ బాఘ్ ప్రాంతంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆదివారం ఈ ప్రాంతానికి సమీపంలో పెట్రోల్ బాంబు విసిరారని ఆందోళనకారులు ఆరోపించారు. పార్లమెంట్ పౌరసత్వ సవరణ చట్టానికి ఆమోదం తెలపడంతో 101 రోజులుగా షాహీన్ బాఘ్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. షాహీన్ బాగ్ ఏరియాను క్లియర్ చేసే క్రమంలో చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి వెళ్లాలని పదే పదే వెళ్లాలని సూచించినప్పటికీ ఆందోళనకారులు కదలకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆందోళనలు విరమించాలని గత వారమే పోలీసులు నిరసనకారులకు సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 500కి చేరువలో ఉండగా.. ఢిల్లీలో 30 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.


By March 24, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-effect-on-anti-caa-protests-shaheen-bagh-cleared-amid-lockdown-in-delhi/articleshow/74785145.cms

No comments