Breaking News

మహారాష్ట్రలో 89కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు


మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 89కు చేరింది. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ఈ మేరకు వివరాలు ప్రకటించింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు సీఎం ఉద్ధావ్ థాక్రే. మహరాష్ట్రలో కరోనా ప్రస్తుతం మూడవ దశలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజూ 10 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వస్తున్న విమనాల్ని సైతం మహా సర్కార్ నిలిపివేసింది. ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వమని తేల్చేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని మార్చి 22 నుంచి 31 వరకు నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది. కేరళలో 52, తెలంగాణలో 27, రాజస్థాన్‌లో 24. కర్నాటకలో 26, ఉత్తర్ ప్రదేశ్‌లో 2, ఢిల్లీలో 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అత్యవసర, నిత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రజా రవాణను నిలిపివేశారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రైళ్లను సైతం నిలిపివేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వైరస్ బారిన పడుతున్న ప్రాంతాలు పెరుగుతున్న సమయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో వైరస్ ప్రభావితమైన 75 జిల్లాలను లాక్ డౌన్ చేయాలని కేంద్రం ప్రకటించింది. ఆదివారం నాడు భారతదేశంలో కరోనాకు మరో ముగ్గురు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మహారాష్ట్రలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది.. ఇది అసాధారణ చర్యలు తీసుకోవాల్సిన అసాధారణ సందర్భమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. మార్చి 23 ఉదయం 6 గంటల నుంచి మార్చి 31 వరకు దిల్లీలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ఆయన ప్రకటించారు. అత్యవసర సేవలు, నిత్యావసర సరకుల కొనుగోలుకు కొన్ని మినహాయింపులు ఉంటాయని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.


By March 23, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/total-number-of-positive-coronavirus-cases-in-maharashtra-rises-to-89/articleshow/74767562.cms

No comments