Sabarimala Verdict Live Updates: శబరిమల రివ్వ్యూ పిటిషన్లపై తీర్పు లైవ్ అప్డేట్స్

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు నిషేధాన్ని 1991లో కేరళ హైకోర్టు చట్టబద్దం చేసింది. అయితే, కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్ యంగ్ లాయర్స్ అసోషియేషన్ 2006లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వారు వాదించారు. దానిపై విచారించిన .. 2018 సెప్టెంబరు 28న తీర్పును వెలువరించింది. స్త్రీ పురుషుల వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని.. ఇది మహిళల హక్కులకు విఘాతం కల్పిస్తుందని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. అన్ని వయస్సుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్లు మహిళలకు అనుకూలంగా తీర్పిచ్చారు. అయితే, ధర్మాసనంలో ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం దీనిని వ్యతిరేకించారు. దేశంలో లౌకిక వాతావరణాన్ని కొనసాగించాలంటే లోతైన అర్థాలున్న మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.
By November 14, 2019 at 09:19AM
No comments