Hyderabad:అద్దెకుంటున్న మహిళపై ఇంటి యజమాని కుమారుడి రేప్

అద్దెకుంటున్న మహిళపై ఇంటి యజమాని కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. లాలాగూడలో వెంకటేశ్‌గౌడ్ అనే వ్యక్తికి సొంతిల్లు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ఆయన కుటుంబం నివాసముంటుండగా.. ఫస్ట్ ఫ్లోర్‌లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. Also Read: అయితే వెంకటేశ్‌గౌడ్ కుమారుడు రాహుల్ తనపై చేశాడంటూ అద్దెకుంటున్న మహిళ అక్టోబర్ 21న ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్ నెలలో తన ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆ యువకుడు తనను బెదిరించి అత్యాచారం చేశాడని, ఈ విషయాన్ని వెంకటేశ్‌గౌడ్‌కు చెబితే కులం పేరుతో దూషించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. Also Read: దీంతో ఓయూ పోలీసులు నిందితుడిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న విషయాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. Also Read:
By November 03, 2019 at 08:40AM
No comments