Breaking News

కన్నకూతురికి నిద్రమాత్రలు ఇచ్చి ఏడాదిగా అత్యాచారం


కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడో కామాంధుడు. 16ఏళ్ల వయసున్న పెద్ద కూతురికి నిద్రమాత్రలు ఇస్తూ ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ అకృత్యాన్ని వీడియో కూడా తీశాడు. మానవ సంబంధాలకే మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. Also Read: శివపూర్‌కు చెందిన అనిల్(పేరు మార్చాం)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అనిల్ ప్రవర్తన నచ్చకపోవడంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముగ్గురు కూతుళ్లు అనిల్‌తోనే ఉంటున్నారు. భార్యకు దూరంగా ఉంటున్న అతడు లైంగిక సుఖం కోసం పెద్ద కుమార్తె(16)పై కన్నేశాడు. రోజూ రాత్రి బాలికకు నిద్రమాత్రలు వేసి శారీరకంగా అనుభవించేవాడు. Also Read: ఈ విషయాన్ని అక్కతో పాటు బయట ఎవరికి చెప్పినా మీకూ ఇదే గతి పడుతుందని మిగిలిన కూతుళ్లను అనిల్ హెచ్చరించాడు. దీంతో వారు తండ్రిని చూస్తేనే భయపడిపోయేవారు. ఇటీవల అతడి మూడో కూతురు ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఈ క్రమంలో తన తండ్రి ప్రస్తావన వచ్చిన సమయంలో బాలిక చాలా భయపడటం ఆమె యజమానురాలు గుర్తించింది. దీంతో ఆమె బాలికను ఏం జరిగిందని ఆరా తీయగా తన తండ్రి దుర్మార్గాన్ని వివరించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి పెద్దకుమార్తెను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి అనిల్‌ను అరెస్ట్ చేశారు. తన తండ్రి అక్కతో చేసిన రాసలీలలను సెల్‌ఫోన్లో రికార్డు చేసి తమకు చూపించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని మిగిలిన ఇద్దరు బాలికలు పోలీసులకు చెప్పడంతో అంతా షాకయ్యారు. అనిల్ పెద్దకుమార్తెను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. Also Read:


By November 06, 2019 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/madhya-pradesh-man-arrested-for-raping-16-yr-daughter-in-one-year/articleshow/71932340.cms

No comments