Breaking News

కాపురంలో ఫోన్‌కాల్ చిచ్చు.. ఆకతాయి వేధింపులకు వివాహిత బలి


హాయిగా సాగిపోయే వారి కాపురంలో ఒక్క ఫోన్‌కాల్ చిచ్చురేపింది. ఆకతాయి అదేపనిగా ఫోన్ చేసి వేధిస్తుండటం, దాన్ని ఆసరాగా తీసుకుని భర్త వేధించడాన్ని తట్టుకోలేని వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన జిల్లాలో జరిగింది. Also Read: జైనూరు మండలం కొండిబగూడ గ్రామానికి చెందిన రమాకాంత్‌కు నాలుగేళ్ల కిందట జైనూరు మండల కేంద్రంలోని శివాజీనగర్‌ వాసి సోన్‌కాంబ్లె సీతాల్‌(24)తో వివాహం జరిగింది. దంపతులిద్దరూ కూలిపనులు చేసుకుంటూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. వీరి జీవితంలోకి అదే గ్రామానికి చెందిన బొడికే అనికేతన్‌ ఫోన్‌కాల్‌ ప్రవేశించడంతో చిచ్చురేగింది. సీతాల్‌పై కన్నేసిన అనికేతన్... తరుచూ ఆమెకు ఫోన్ చేసి వేధించసాగాడు. దీంతో బాధితురాలు అతడిని ఫోన్‌లోనే హెచ్చరించింది. మరోసారి ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. దీన్ని అవమానంగా భావించిన అనికేతన్.. ఆమె భర్తకు లేనిపోని మాటలు చెప్పి నమ్మించాడు. Also Read: ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన రమాకాంత్‌ భార్యను నిలదీయడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. తనపై అకారణంగా నిందలు వేయడమే కాకుండా ఫోన్‌ ద్వారా యువకుడు వేధింపులు ఆపకపోవడంతో సీతాల్‌ బుధవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 15, 2019 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-married-woman-commits-suicide-over-family-disputes/articleshow/72064863.cms

No comments