అమ్మను చూసేందుకు రైల్లో వెళ్తూ యువతి దుర్మరణం

చదువు పూర్తికావడంతో హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న యువతి దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో కూతురు ఇంటికి వస్తోందంటూ ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులు ఆమె మరణవార్త విని విషాదంలో మునిగిపోయారు. మంచిర్యాలకు చెందిన కోటు మనోహర్ కూతురు అనూష (20) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. Also Read: అమ్మను చూసి చాలా రోజులైందని, తాను ఇంటికి వస్తున్నానాంటూ అనూష బుధవారం రాత్రి తండ్రికి ఫోన్ చేసి సికింద్రాబాద్‌లో రైలెక్కింది. రఘునాథపల్లి రైల్వేస్టేషన్ దాటాక అనూష ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడిపోయింది. ఆమె పైనుంచి రైలు వెళ్లిపోవడంతో అవయవాలు చెల్లాచెదురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిది. గురువారం ఉదయం రైల్వే సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: రైల్వే ఎస్ జితేందర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె వద్ద లభించిన పాన్, ఆధార్ కార్డుల ఆధారంగా అనూషగా గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో చేరుకున్న వారు ఒక్కగానొక్క కూతురు విగతజీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం అనంతరం అనూష మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు Also Read:
By November 15, 2019 at 12:05PM
No comments