Breaking News

తమిళ `అర్జున్‌ రెడ్డి`కి తీరని కష్టాలు.. రిలీజ్‌ మరోసారి వాయిదా!


హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సెన్సేషనల్‌ హిట్ సినిమా . ఈ సినిమా తెలుగులోనే కాదు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఒక్క సినిమాతోనే విజయ్‌ దేవరకొండ స్టార్‌ లీగ్‌లోకి చేరటంతో పాటు క్రేజీ స్టార్‌గా మారిపోయాడు. అర్జున్‌ రెడ్డి ఘన విజయం సాధించటంతో ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేశారు. అర్జున్‌ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ కబీర్‌ సింగ్‌ సెన్సేషల్‌ హిట్ అయ్యింది. షాహిద్‌ కపూర్‌, కియారా అద్వానీలు జంటగా నటించిన ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. హిందీ రీమేక్‌తో పాటు అర్జున్‌ రెడ్డి తమిళ రీమేక్‌ కూడా అదే సమయంలో ప్రారంభమైంది. Also Read: ఈ సినిమాతో చియాన్‌ విక్రమ్‌ తన తనయుడు ధృవ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. ముందుగా ఈ సినిమాను `వర్మ` పేరుతో బాల దర్శకత్వంలో తెరకెక్కించారు. అయితే బాల రూపొందించిన రీమేక్ నిర్మాతలకు సంతృప్తినివ్వకపోవటంతో ఆ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి మరోసారి పూర్తి సినిమాను రూపొందించారు. `ఆదిత్య వర్మ` పేరుతో రూపొందించిన ఈ సినిమాకు అర్జున్‌ రెడ్డి సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేసిన గిరీశయ్య దర్శకత్వం వహించాడు. Also Read: ఇప్పటికే షూటింగ్‌తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటీవల సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు `ఏ` సర్టిఫికేట్‌ను జారీ చేశారు. అయితే చిత్ర నిర్మాత సెన్సార్‌ సర్టిఫికేట్‌ విషయంలో ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. సినిమా ప్రేక్షకులకు మరింత చేరువవ్వాలి అంటే యూఏ సర్టిఫికేట్‌ అయితే బెటర్‌ అని భావిస్తున్నారట. అందుకే సెన్సార్‌ సభ్యులతో యూఏ సర్టిఫికేట్ కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. అవసరమైతే రిలీజ్‌ వాయిదా వేసైనా యూఏ సర్టిఫికేట్‌తోనే ఆదిత్యవర్మను రిలీజ్ చేసేందుకుప్లాన్ చేస్తున్నారట. ముందుగా ఈ సినిమాను నవంబర్‌ 8న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. తాజా నిర్ణయంతో రిలీజ్‌ మరితం ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా నిర్మాతల నిర్ణయంతో మరింత ఆలస్యం కానుంది. Also Read:


By November 06, 2019 at 11:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/arjun-reddy-tamil-remake-adithya-varma-release-date-postponed/articleshow/71934704.cms

No comments