Breaking News

రెమ్యూనరేషన్‌తో షాకిస్తున్న యాంకర్ భామలు!


టాలీవుడ్‌లో ఉన్న యాంకర్స్ మరే ఇండస్ట్రీలో ఉండరనిపిస్తుంది. టాలీవుడ్‌లో ట్రెడిషనల్ యాంకర్స్ ఉన్నారు. కత్తిలాంటి గ్లామర్ ఒలకబోసే యాంకర్స్ ఉన్నారు. టాలీవుడ్ లో సినిమా ఈవెంట్స్‌కి, ఆడియో ఫంక్షన్స్‌కి, సెలెబ్రిటీ షోస్‌కి, టివి ఛానల్స్ ప్రోగ్రామ్స్‌కి పనిచేసే యాంకర్స్ హీరోయిన్స్‌‌ రేంజ్‌లో అందాల ఆరబోతతో పాటు యాంకరింగ్‌తో హడలెత్తిస్తారు. సుమ, ఝాన్సీ లాంటి యాంకర్స్ కాస్త ట్రెడిషనల్ యాంకర్స్‌గా పేరు పొందితే.. అనసూయ, రష్మీ, మంజూష, శ్యామల, శ్రీముఖిలాంటి యాంకర్స్ అందాలు ఒలకబోస్తూ అదరగొట్టేస్తున్నారు. ఈ హాట్ అండ్ క్రేజీ యాంకర్స్ తాము చేసే ఈవెంట్స్‌కి లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు. మలయాళం నుండి వచ్చి తెలుగు యాంకర్స్ అందరిని ఓ పక్కన నిలబెట్టి టాప్ పొజిషన్‌లో నిలబడిన సుమ యాంకర్‌గా ఒక్కో ఈవెంట్‌కి 2 నుండి రెండున్నర లక్షల్లో పారితోషకం తీసుకుంటోందట. ఆడియో ఫంక్షన్‌కి ఒక రేటు, సినిమా అవార్డ్స్ ఈవెంట్స్‌కి ఒక రేటు, టీవీ ఛానల్స్‌లోని కార్యక్రమాలకు ఒక రేటు అంటూ ఓ రేంజ్‌లో అల్లాడిస్తున్న సుమ కనకాల పారితోషకం విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

ఇక నెక్స్ట్ ప్లేస్‌లో యాంకరింగ్ ప్రపంచంలో గ్లామర్ ఒరవడికి శ్రీకారం చుట్టిన గ్లామర్ భామ అనసూయ ఉంది. అవార్డ్స్ ఫంక్షన్స్‌కి యాంకరింగ్ పెద్దగా చెయ్యని అనసూయ జబర్దస్త్ షో తో పాటుగా... మరికొన్ని షోస్ చేసే అనసూయ ఒక్కో ఈవెంట్ కి 2 లక్షల పారితోషకం అందుకుంటుందట. ఇక ఆ నెక్స్ట్ ప్లేస్ జబర్దస్త్ రష్మిదే. అనసూయ తర్వాత అంత అందాన్ని చూపిస్తున్న రష్మీ కూడా ఒక్కో ప్రోగ్రాంకి లక్షన్నర చొప్పున ఛార్జ్ చేస్తుంటే... ఆడియో వేడుకలకి వేదికగా మారిన మంజూష ఒక్కో ఈవెంట్‌కి 50 వేల చొప్పున ఛార్జ్ చేస్తుందట. ఇక శ్యామల రెమ్యునరేషన్ కూడా పర్లేదు. ఇక ఇప్పటివరకు పటాస్, జీ తెలుగు ఛానల్ షోస్ తో బిజీ అయిన శ్రీముఖి కూడా బిగ్ బాస్ తర్వాత ఫుల్ క్రేజ్‌తో తన దగ్గరికి వచ్చిన ఛానల్ ప్రొడ్యూసర్స్‌ని భారీగానే డిమాండ్ చెయ్యడం మొదలెట్టిందట.



By November 14, 2019 at 03:27AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48261/telugu-anchors.html

No comments