Breaking News

తీర్పు నిరాశపరిచింది.. అయినా గౌరవిస్తాం: సున్నీ వక్ఫ్ బోర్డు


అయోధ్యలో వివాదాస్పద భూమి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తమను తీవ్రంగా నిరాశపరిచిందని, అయినప్పటికీ గౌరవిస్తామని పేర్కొంది. అయోధ్యలో తమకు ఐదెకరాలు అవసరం లేదని స్పష్టం చేసింది. Also Read: ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న అయోధ్య వివాదానికి శనివారం సుప్రీంకోర్టు తెరదించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి కేటాయించాలని, మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమని, ముస్లింలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారని చీఫ్ జిస్టిస్ రంజన్ గొగోయ్ అభిప్రాయపడ్డారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని, గతంలో రెండు మతాల వారు వివాదాస్పద స్థలంలో ప్రార్థనలు చేసేవారన్నారు. Also Read: మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందని, వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందు నిర్మాణం ఉండేదని పురావస్తు విభాగం చెబుతోందని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ స్థలంపై మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డ్ నిరూపించలేకపోయిందని, శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని పేర్కొంది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని పంచుకోవాలంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణం కోసం 5ఎకరాల స్థలాన్ని అయోధ్య ట్రస్టు్ కేటాయించాలని ఆదేశించింది. Also Read:


By November 09, 2019 at 12:09PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sunni-waqf-board-responds-to-ayodhya-case-supreme-verdict/articleshow/71980905.cms

No comments