Breaking News

నయన్ ఛాన్స్ మిస్.. త్రిషను ఓకే చేసిన కొరటాల!


టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టి షూటింగ్ షురూ చేసిన చిత్రబృందం.. చిరు సరసన హీరోయిన్‌గా ఎవర్ని తీసుకోవాలి.. టాలీవుడ్‌లో ఉండేవాళ్లే సరిపోతారా..? కోలీవుడ్, బాలీవుడ్ నుంచి పట్టుకురావాలా..? అని కొరటాల యోచిస్తున్నారు. అయితే ఇప్పటికే ఫలానా హీరోయిన్‌ను తీసుకుంటారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అవన్నీ పుకార్లకే పరిమితమయ్యాయి. అంతేకాదు.. ‘సైరా’లో చిరు సరసన నటించి మెప్పించిన లేడీ సూపర్‌స్టార్ నయనతారను తీసుకోవాలని కొరటాల భావిస్తున్నారని మొన్నటి వరకూ వార్తలు వచ్చాయ్.

అయితే.. తాజాగా అబ్బే అదేం లేదు.. ఒకప్పుడు చిరు సరసన నటించి మెప్పించి మెగాభిమానుల మన్ననలు పొందిన, బిజీబిజీగా హీరోయిన్‌గా పేరుగాంచిన త్రిషను తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ తెలుగులోకి చాలా రోజుల తర్వాత రానుందని.. అది కూడా మెగాస్టార్‌తో అని తెలుస్తోంది. వాస్తవానికి చిరు-త్రిష సినిమా చేయడం ఇదేం మొదటి సారి కాదు.. ‘స్టాలిన్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీ చేసిన సినిమాలు అంతంత మాత్రమే.. అందుకే ఇక కోలీవుడ్‌కే పరిమితం కావాలని భావించి అక్కడే సెటిల్ అయిపోయింది. 

చిరు సరసన నటించాలని త్రిషను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హీరోయిన్‌ కోసం కొరటాల వెతుక్కోవాల్సిన పనిలేకుండా పోయింది. అయితే ఇక్కడే ఇంకో ట్విస్ట్.. అంతకుముందే ఇదివరకే నయన్‌ను కన్ఫామ్ చేయాలని భావించిన దర్శకుడు.. ఆమెను తీసుకుంటే ప్రమోషన్స్‌కు రారని.. అలా రాకపోతే బాగోదని అందుకే నయన్‌ను పక్కనెట్టాల్సి వచ్చిందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సో.. నయన్ చేజేతులారా వదులుకున్న అవకాశం త్రిష దక్కించుకుందున్న మాట. మరి త్రిష కూడా ఫైనలో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.



By November 07, 2019 at 02:27AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48157/nayanatara.html

No comments