మహిళను అసభ్యంగా ఫోటో తీసిన యువకుడు.. చితక్కొట్టిన ఆమె భర్త

వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వచ్చే మహిళలను సెల్‌ఫోన్లో అసభ్యంగా చిత్రీకరిస్తున్న యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన జిల్లా చిలకలూరిపేటలో జరిగింది. పట్టణానికి చెందిన ఓ యువకుడు మద్దిరాలలోని గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజూ అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న ఆ పరిశ్రమకు చెందిన షాపునకు వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్లే మహిళలను సెల్‌ఫోన్లో అసభ్యకర రీతిలో వీడియో తీస్తూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. Also Read: ఇలాగే ఓ మహిళను నడుము కనిపించేలా ఫోటో, వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో విషయం ఆమె భర్తకు తెలిసింది. దీంతో గురువారం అతడు షాపునకు వచ్చి ఆ యువకుడిని చితకబాదాడు. బీరు సీసాతో తలపై కొట్టడంతో యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు బాధితుడిని 108 సాయంతో చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. Also Read: Also Read:
By November 08, 2019 at 09:33AM
No comments