Breaking News

విజయ్ దేవరకొండ.. పాన్ ఇండియా కథ అయితేనే!


బాహుబలి చూసి హీరోలంతా పాన్ ఇండియా ఫిలిమ్స్ మీద పడ్డారు. బాహుబలి హీరోనే పాన్ ఇండియా సినిమా అంటూ సాహోతో చేతులు కాల్చుకున్నాడు. సాహో దెబ్బకి రాధాకృష్ణ సినిమా బడ్జెట్ ని ప్రభాస్ కంట్రోల్ లో పెడుతున్నాడని అంటున్నారు. ఇక మెగా స్టార్ చిరు సై రా తో ఇతర రాష్ట్రాల్లో కోలుకోలేని దెబ్బతిన్నాడు. అందుకే కొరటాలతో తియ్యబోయే సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అనే టాక్ ఉంది. ఇక తాజాగా మరో హీరో పాన్ ఇండియా సినిమా కోసం తహతహలాడుతున్నాడు. అదే డియర్ కామ్రేడ్ తో దెబ్బతిన్న విజయ్ దేవరకొండ. అసలు డియర్ కామ్రేడ్ నే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటుగా హిందీలోనూ విడుదల చేద్దామనుకున్న విజయ్ దేవరకొండకి ఆ సినిమా దెబ్బేసినా.. మళ్ళీ అన్ని భాషల్లో సినిమా చెయ్యాలనుకుంటున్నట్లుగా చెబుతున్నాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత పూరితో ఫైటర్ సినిమా చెయ్యబోతున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని మజిలీ డైరెక్టర్ తో కమిట్ అయ్యాడని అన్నారు. కానీ విజయ్ కి కథ చెప్పడానికొచ్చిన ఓ హిట్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ పెట్టిన కండిషన్ కి ఆ డైరెక్టర్ కి దిమ్మతిరిగిందని టాక్. ఆ హిట్ డైరెక్టర్ తో ఏదైనా పాన్ ఇండియా కథ ఉంటే చెప్పండి వింటా అని అనడంతో ఆ డైరెక్టర్ షాక్ అయ్యి.. అయితే ఈ కథ మీకు కుదరదులే అని అక్కడనుండి చల్లగా జారుకున్నాడట. మరి సాహో, సై రా చూసాక తనకున్న క్రేజ్ తో తాను పాన్ ఇండియా ఫిలిం చేసినా సక్సెస్ కాగలను అని విజయ్ బలంగా నమ్ముతున్నట్టుగా ఉంది. 



By November 13, 2019 at 04:19AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/48246/vijay-deverakonda.html

No comments