Breaking News

ఆమెను రేప్ చేసి చంపేశారు.. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన నిజాలు


పాకిస్థాన్‌‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హిందూ విద్యార్థిని కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించినా పోస్టుమార్టం నివేదిక గుట్టురట్టు చేసింది. ఆమెను అత్యాచారం చేసి తర్వాత గొంతు నులిమి చంపేసినట్లు నివేదికలో పేర్కొనడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. Also Read: సింధ్‌ ప్రావిన్స్‌లోని లర్ఖానా జిల్లాలోని బీబీ ఆసిఫా డెంటల్‌ కాలేజీ విద్యార్థిని నమ్రితా కుమారి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌ 16న తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో కనిపించింది. తన చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నమ్రితా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె బాడీలో మగ డీఎన్ఏ ఉందని డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో నమ్రితను అత్యాచారం చేసి హత్య ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. Also Read: ఈ కేసుకు సంబంధించి 32 మందితో పాటు మృతురాలి కాల్‌డేటా ఆధారంగా తోటి విద్యార్థులైన మెహ్రాన్ అబ్రో, అలీ షాన్ మెమన్లను అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలువడిన పోస్టుమార్టం నివేదికలో నమ్రితపై అత్యాచారం చేసి గొంతు నులిచి చంపేశారని వెల్లడి కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ అక్కడ కొద్దిరోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రావడంతో ఆందోళనలు మరింత పెరిగే అవకాశముందని సింధ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. Also Read:


By November 08, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pakistan-hindu-medical-student-namrita-raped-killed-autopsy-report-confirms/articleshow/71965807.cms

No comments