Breaking News

కోచింగ్ సెంటర్లో కామాంధుడు.. కోరిక తీర్చాలంటూ అమ్మాయిలకు వేధింపులు


గురువంటే విద్యాబుద్ధులు చెప్పి, మంచి నడవడిక, క్రమశిక్షణ నేర్పించాలి. కానీ ముంబయిలోని ఓ టీచర్ మాత్రం కన్నకూతుళ్లలా చూసుకోవాల్సిన విద్యార్థినులపైనే కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధింస్తూ బలవంతం చేస్తున్నాడు. Also Read: ముంబైలోని తోడ్కోని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కోచింగ్ సెంటర్లో హీరానందాని అనే వ్యక్తి ఫ్యాకల్టీ‌గా పనిచేస్తున్నాడు. తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే విద్యార్థినులతో అతడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని అసభ్యంగా తాకుతూ, ఎక్కడెక్కడో చేతులు వేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడి చర్యలు వెగటు పుట్టించినా విద్యార్థినులు మాత్రం ఓర్పుతో సహిస్తూ వచ్చేవారు. ఇటీవల ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన అమ్మాయిపై ఆ కామాంధుడి కన్ను పడింది. Also Read: క్లాస్ ముగిశాక అవసరం లేకున్నా ఆ అమ్మాయిని తన ఛాంబర్‌కు రప్పించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. తన కోరిక తీరిస్తే విడిగా పాఠాలు చెప్పి మంచి మార్కులు వచ్చేలా చేస్తానని ఆమెకు ఆఫరిచ్చాడు. దీంతో భయపడి పోయిన బాధితురాలు అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు బంధువులతో కలిసి అక్కడికి చేరుకుని హీరానందన్‌ను చితకబాదారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. Also Read:


By November 06, 2019 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/coaching-centre-faculty-arrested-for-sexually-harassed-on-girls-in-mumbai/articleshow/71933403.cms

No comments