Breaking News

`నా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్‌`.. లెజెండరీ డైరెక్టర్‌కు పంచ్‌!


విభిన్న చిత్రాలతో దక్షిణాదిలో లెజెండరీ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న టెక్నీషియన్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌. దర్శకుడిగానే కాక నటుడిగా, నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌. అయితే దర్శకత్వం మీద దృష్టి పెట్టినన్ని రోజులు టాప్‌ ప్లేస్‌ లో ఉన్న , నిర్మాతగా మారిన తరువాత పూర్తిగా ఫాం కోల్పోయాడు. వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డాడు. దీంతో తాను నిర్మాతగా మారిన చిత్రాలు రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఏకంగా ఈ లెజెండరీ దర్శకుడు నిర్మించిన మూడు సినిమాలు చాలా కాలంగా విడుదలకు నోచుకోకుండా ఉండిపోయాయి. వీటిలో రెండు సినిమాలకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించాడు. గౌతమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు కూడా రిలీజ్‌ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆయన కేవలం నిర్మాతగా వ్యవహిరంచిన సినిమా పరిస్థితి ఇక చెప్పేదేముంది. Also Read: అయితే తాజాగా ఆర్థిక ఇబ్బందులను కొంత వరకు సెటిల్‌ చేసుకొని తన సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు గౌతమ్‌ మీనన్‌. ధనుష్‌ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఎన్నై నొక్కి పాయుం తోటా సినిమాను నవంబర్‌ 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అంతేకాదు విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన మరో సినిమా ధృవ నక్షత్రంను కూడా త్వరలో రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు గౌతమ్‌ మీనన్‌. Also Read: అయితే ఈ ట్వీట్లపై యువ దర్శకుడు కార్తిక్ నరేన్‌ వెటకారంగా స్పందించాడు. 21 ఏళ్ల వయసులోనే 16 అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయి అందరి దృష్టిని ఆకర్షించాడు . తరువాత గౌతమ్‌ మీనన్‌ నిర్మాణంలో నరగసూరన్‌ అనే సినిమాను తెరకెక్కించాడు. సందీప్‌ కిషన్‌, అరవింద్‌ స్వామి, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా రెండేళ్ల క్రితమే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా ఇంతవరకు రిలీజ్‌ కాలేదు. దీంతో గౌతమ్‌ తను డైరెక్ట్ చేసిన సినిమాలను రిలీజ్ చేస్తుండటంపై కార్తీక్‌ నరేన్‌ స్పందించాడు. నా సినిమా కూడా వెలుగును చూస్తే సంతోషిస్తాం సార్‌ అంటూ వెటకారంగా ట్వీట్‌ చేశాడు కార్తీక్‌. ధృవ నక్షత్రం నా మనసుకు దగ్గరైన సినిమా అంటూ గౌతమ్‌ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్‌కు రిప్లైగా నరగసూరన్‌ కూడా నా మనసుకు దగ్గరైన సినిమా అంటూ స్పందించాడు. Also Read:


By November 05, 2019 at 02:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/karthick-naren-questions-gautam-menon-over-naragasoorun-release/articleshow/71920281.cms

No comments