అన్న భార్యను ఎత్తుకెళ్లి అత్యాచారం.. ఆత్మహత్య చేసుకున్న వితంతువు

భర్త చనిపోయినా కూలి పనులు చేసుకుంటూ కొడుకును పోషిస్తున్న లైంగిక వేధింపులకు బలైంది. తల్లిలా భావించాల్సిన వదినపై కన్నేసిన మరది తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా వేధించాడు. మనస్తాపానికి గురైన బాధితురాలు బిడ్డను అనాథ చేసి ఆత్మహత్య చేసుకుంది. Also Read: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూర్ గ్రామానికి చెందిన శ్రీదేవికి శంకర్రాజుపల్లి తాటిపల్లి వెంకటయ్యతో 13ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం వెంకటయ్య గుండెపోటుతో చనిపోవడంతో శ్రీదేవి కొడుకుతో కలిసి జీవిస్తోంది. అయితే భర్త చనిపోయి పుట్టెడు శోకంలో ఉన్న ఆమెపై వెంకటయ్య తమ్ముడు రామయ్య కన్నేశాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఏడాది నుంచి తీవ్రంగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టినా అతడు పద్ధతి మార్చుకోలేదు. Also Read: ఈ నెల 1న శ్రీదేవి పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో రామయ్య అమెను తన ఇంటికి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. భార్య సహకారంతో శ్రీదేవిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి బయటకు తోసేశాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీదేవి అదేరోజు రాత్రి 8 గంటల సమయంలో పురుగుల మందు తాగింది. ఆమెను గమనించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా శనివారం చనిపోయింది. దీంతో తన చెల్లెలి చావుకు రామయ్యే కారణమని శ్రీదేవి సోదరుడు కావిరి అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శ్రీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. Also Read:
By November 03, 2019 at 11:03AM
No comments