Breaking News

రవితేజతో `క్రాక్‌`.. క్రేజీ టైటిల్‌ ఫిక్స్‌ చేసిన గోపిచంద్‌


సీనియర్‌ హీరో రవితేజకు ఇప్పుడు బ్యాడ్‌ టైం నటిస్తోంది. ఈ హీరో హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఇటీవల కాలంలో ఒక్క రాజా ది గ్రేట్‌ తప్ప నటించిన ఏ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ సీనియర్‌ స్టార్‌. ప్రస్తుతం రవితేజ.. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను కూడా ఫైనల్‌ చేశాడు మాస్‌ మహరాజ్‌. తనతో గతంలో డాన్‌ శీను, బలుపు లాంటి సూపర్‌ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకత్వంలో హ్యాట్రిక్‌ సినిమా చేస్తున్నాడు గోపీచంద్‌. Also Read: గురువారం ప్రారంభం కానున్న ఈ సినిమాకు క్రేజీ టైటిల్‌నలు ఫిక్స్‌ చేశారు చిత్రయూనిట్‌. రవితేజ మరోసారి పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. షూటింగ్ ప్రారంభం అవుతున్న సందర్భంగా రవితేజ లుక్‌తో పాటు టైటిల్‌ను కూడా రిలీజ్‌ చేశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపించనున్నాడు. Also Read: సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌లో బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తోంది. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాను 2020 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. Also Read:


By November 14, 2019 at 08:33AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/raviteja-gopichand-malinenis-movie-title-krack/articleshow/72048584.cms

No comments