స్టూడెంట్‌పై లైంగిక వేధింపులు.. వైస్ ప్రిన్సిపాల్ అరెస్ట్

విద్యార్థులను కన్నతండ్రిలా చూసుకోవాల్సి గురువే వారిని కామంతో చూస్తున్నాడు. కూతురు వయసున్న వారిపై చేతులు వేస్తూ వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. తన కోరిక తీరిస్తే మార్కులు ఎక్కువ వచ్చేలా చేస్తానంటూ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. చివరకు విద్యార్థులు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కామాంధుడి ఆట కట్టించారు పోలీసులు. Also Read: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం కేర్చిపల్లి గ్రామానికి చెందిన గుండు ముకేశ్‌రెడ్డి ఉన్నత చదువులు చదివాడు. ప్రస్తుతం హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని మదీనాగూడ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు ఐఐటీ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు. విద్యార్థులకు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సలహాలు అందించి, మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం అతడి బాధ్యత. Also Read: దీన్ని ఆసరాగా తీసుకున్న ముకేశ్‌రెడ్డి విద్యార్థినులతో చనువుగా మాట్లాడేవాడు. ఎక్కడెక్కడో చేతులు వేసి నిమురుతూ అసభ్యంగా మాట్లాడేవాడు. పాఠాలు చెప్పడం మానేసి.. ‘నీ డ్రస్ బాగుంది, నువ్వు చాలా అందంగా ఉంటావ్, సినిమాకు వెళ్దామా?’.. అంటూ అసభ్యంగా మాట్లాడేవాడు. ఇటీవల అతడి ఆగడాలు మరింత ఎక్కువ కావడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరూ లేని సమయంలో తమను ఏమైనా చేస్తాడేమో.. అన్న ఆందోళనతో ఈ నెల 8వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం ముఖేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By November 13, 2019 at 12:47PM
No comments