Breaking News

పోలీసు వేషంలో కామాంధులు.. యువతిని అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్


నకిలీ పోలీసుల అవతారమెత్తిన ముగ్గురు వ్యక్తులు ఓ యువతిని బెదిరించి అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. జాష్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు నకిలీ పోలీసుల అవతారమెత్తారు. బుధవారం వీరు ఓ మార్గంలో వాహనదారులను అడ్డగించి డబ్బులు వసూలు చేశారు. అదే సమయంలో కాలేజీ నుంచి వస్తున్న ఓ యువతిని ఆపి వివరాలు కనుక్కున్నారు. ఆ మార్గంలో ఒంటరిగా వెళ్లడం మంచిది కాదని, తాము ఇంటి వద్ద దించుతామని ఓ నకిలీ పోలీస్ ఆమెను బైక్ ఎక్కించుకున్నాడు. అతడిని అనుసరిస్తూ మరో ఇద్దరూ బైక్‌పై వెళ్లారు. Also Read: యువతిని ఇంటికి కాకుండా ఓ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురు కామాంధులు బెదిరించారు. తమ కోరిక తీర్చకపోతే చంపేస్తామని బెదిరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో బాధితురాలు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు విషయం చెప్పింది. వారు తమ కుమార్తెను వెంటబెట్టుకుని ఆస్తా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. Also Read: ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీమ్స్‌ ఏర్పాటుచేశారు. ఆ ముగ్గురూ గతంలోనూ పోలీస్ వేషం వేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By November 15, 2019 at 01:00PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/3-fake-policemen-gang-raped-student-in-the-chhattisgarh-forest/articleshow/72068224.cms

No comments