ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో ఐటీ సోదాలు

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో పలు హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. కృష్ణా జిల్లాలోని పెదగొన్నూరులోని ఆయన స్వగృహంలో ఈ సోదాలు జరిగాయి. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం. శ్వేత ఆధ్వర్యంలో గురువారం ఈ సోదాలు జరిగాయి. అయితే సోదాలు ఇంకా పూర్తి కాలేదని మరో రెండు బీరువాలు తెరవాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. Also Read: ప్రస్తుతం కేఎల్ నారాయణ హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన శుక్రవారం గ్రామానికి చేరుకుంటారు ఆ తరువాత రెండు బీరువాలను కూడా సోదా చేసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అయితే నారాయణ ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్, విజయవాడల్లోని ఆయన ఇతర వ్యాపార కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. Also Read: కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై హలో బ్రదర్, సంతోషం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాఖీ, దొంగాట లాంటి హిట్ చిత్రాలను నిర్మించారు. త్వరలో రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read:
By November 08, 2019 at 11:45AM
No comments