కృష్ణా జిల్లాలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తాత అత్యాచారం

కృష్ణా జిల్లా మండవల్లిలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై సొంత తాతే అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు మంగళవారం రాత్రి సంతకు వెళ్లి నిద్రపోతున్న పాపను చూసుకోవాలని వృద్ధుడికి సూచించారు. ముక్కపచ్చలారని ఆ చిన్నారిపై కన్నేసిన తాత మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగొచ్చిన తల్లిదండ్రులు ఈ ఘోరం తెలుసుకుని షాకయ్యారు. Also Read: కృష్ణా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన కుటుంబం బతుకుదెరువు కోసం మండవల్లికి వచ్చి ఓ రొయ్యల చెరువుకు కాపలాగా ఉంటోంది. ఆ దంపతులు ఇద్దరు ఆడబిడ్డలు, భార్య తండ్రితో కలిసి ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం వారపు సంతకు వెళ్లిన దంపతులు తమ మూడేళ్ల చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆ వృద్ధుడికి చెప్పి వెళ్లారు. వారు సంతలో సరకులు కొని రాత్రి 9 గంటల సమయానికి ఇంటికి చేరుకున్నారు. అపస్మారకస్థితిలో మంచం మీద పడి ఉన్న పాపను గమనించిన తల్లి ‘ఏం జరిగింది నాన్నా’ అంటూ బిగ్గరగా అరిచింది. Also Read: భార్యాభర్తలు గట్టిగా ప్రశ్నించేసరికి మద్యం మత్తులో చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టానని అసలు విషయం బయటపెట్టాడు ఆ కామాంధుడు. దీంతో బాధితురాలి తల్లి బుధవారం తెల్లవారు జామున మండవల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తండ్రిపైనే ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. పాప పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ఈ కేసుపై డీఎస్పీ సత్యానందం, సీఐ జయకుమార్‌లు ఫోకస్ పెట్టారు. బాధితురాలి తల్లిదండ్రులతో పాటు, బంధువులను విచారించి వివరాలు సేకరించారు. నిందితుడిపై ఫోక్సో చట్టాన్ని ప్రయోగించినట్లు డీఎస్పీ తెలిపారు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బుధవారం పలు మహిళా సంఘాలు కైకలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళన చేపట్టాయి. Also Read: గమనిక: అత్యాచారాలు, లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు సంబంధించి గోప్యత పాటించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారి పేర్లు, వివరాలు వెల్లడించడంలేదు.
By November 14, 2019 at 09:46AM
No comments